
నవ్యాంధ్రలో హక్కులకు నగుబాటేనా!
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ సీపీ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేటి నుంచి తలపె ట్టిన నిరవధిక నిరాహారదీక్షలు వాయిదా పడి ఉండవచ్చు. కానీ వాయిదాకు ముందు జరి గిన పరిణామాలూ, ప్రభుత్వ చర్యలూ చర్చనీయాంశాలుగా మిగిలి ఉన్నాయి. ముఖ్యంగా విపక్షానికి సైతం పాలక పక్షం మాట్లాడే హక్కు లేకుండా చేసే ప్రయత్నం ఇక్కడ కనిపిస్తుంది. ఇది నియంతృత్వం. అప్రకటిత ఎమర్జెన్సీ. చేసిన వాగ్దానాలను పాలకులు మరచిపోయినప్పు డు పార్లమెంట్‌లోను, శాసనసభలలోనూ వారిని నిలదీ యడం విపక్షాల పని.
అందుకు అవకాశం ఇవ్వనప్పుడు ప్రతిపక్షాలు రోడ్డున పడి పాలకుల వైఖరిని ఎండగట్టడం అనివార్యం. ఎన్డీయే-2, టీడీపీ, టీఆర్‌ఎస్ ఎన్నికల సమ యంలో చేసిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమై నాయి. అధికారం చేపట్టాక గత పాలకులపై నెపం వేసి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఇలా అధి కారపక్షాలు విఫలమైనప్పుడల్లా ఆ అవకాశాన్ని విప క్షాలు అంది పుచ్చుకుని గళం విప్పాలి. నవ్యాంధ్రప్రదే శ్‌లో జగన్ దీక్షలు అందులో భాగమే.
ప్రత్యేక హోదా ప్రకటించిన రెండు పార్టీలు అధికా రంలోకి వచ్చాక ఆ సంగతి మరిచాయి. ముఖం చాటే శాయి. ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్ర ం చెబుతున్న కుంటిసాకులూ, జగన్ దీక్షకు అనుమతి నిరాకరణకు రాష్ట్ర పోలీసుల ద్వారా చంద్రబాబు చెప్పించిన కారణా లూ ఒక్కలాగే ఉన్నాయి. మేము అనుమతిస్తే ముందుకు వెళ్లాలి, లేదంటే మానుకోవాలి అన్న తీరులో వారి అధి కార దర్పం కనిపిస్తున్నది. రాజ్యాంగంలోని 19వ ఆర్టికల్ ప్రకారం చూస్తే దీక్ష అనుమతి నిరాకరణకు వారు చెబు తున్నవి కుంటిసాకులే. ఈ ఆర్టికల్ (1) ఏబీసీ నిబం ధనల ప్రకారం దేశ స్వాతంత్య్రానికీ, అఖండతకీ, భద్ర తకీ, విదేశీ సంబంధాలతో పాటు శాంతికి విఘాతం కలు గుతుందనుకుంటే ఒక వ్యక్తి చేయబోయే దీక్షకు అను మతి నిరాకరించవచ్చు.
ఇది ప్రభుత్వ బాధ్యత. మర్యా ద, అనైతికత, కోర్టు ధిక్కారం, పరువునష్టం, నేరానికి ప్రేరేపించే చర్యలు ఉన్నా కూడా అనుమతి నిరాకరించ వచ్చు. కాబట్టి కేవలం శాంతిభద్రతలకు విఘాతం అన్న సాకుతో అనుమతిని నిరాకరించడమంటే ఆర్టికల్ 19 ఇచ్చిన స్వేచ్ఛాస్వాతంత్య్రాలను నిరాకరించడమే. దీక్షకు ఎంచుకున్న ఉల్ఫ్‌హాల్ గ్రౌండ్, పరిసరాలను గురించి చూద్దాం. అక్కడ ప్రభుత్వ ఆస్పత్రికి ఇటీవల రెండో గేటు ను నిర్మించిన మాట నిజమే. కానీ ఆ సంగతి చాలా మందికి ఇప్పటికీ తెలియదు. అందువల్ల దీక్ష కారణంగా అక్కడ ప్రాణనష్టం జరుగుతుందని ముందే ఊహించ డం అసందర్భమే. ఉల్ఫ్‌హాల్ గ్రౌండ్ నగరం నడిబొడ్డే.
కానీ వ్యాపార కూడలి కాదు. కాబట్టి అనుమతి నిరాక రణ కేవలం గొంతు నొక్కే చర్యే. రాజమండ్రి పుష్కరా లలో జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారకుడైన చంద్ర బాబును ముద్దాయిగా గుర్తించని పోలీసులు, జగన్ దీక్షతో సంభవించనున్న ప్రమాదం గురించి జోస్యం చెప్పడం హాస్యాస్పదం. ఊహాజనితమైన ఆలోచనలతో ఒక వ్యక్తి భావ ప్రక టనా స్వేచ్ఛను శాంతిభద్రతల పేరిట నిలువరించడం సరికాదని ఫతేఘర్ వర్సెస్ డాక్టర్ రామ్‌మనోహర్ లోహి యా కేసులో (1966 ఎస్‌సీ 633)సుప్రీంకోర్టు పేర్కొ న్నది. కాబట్టి వైఎస్సార్‌సీపీ పార్టీ శ్రేణులకు ఉన్న సమా వేశపు హక్కును హరించే అధికారం పాలకులకు లేదు. ఇలాంటి ధోరణి ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదు.
ఈ అంశం మీద కోర్టులు షరతులతో కూడిన అను మతి ఇచ్చినా, ఇవ్వకున్నా వైఎస్సార్ సీపీ సహా, మిగిలిన విపక్షాలు ఏకం కావలసిన అవసరం ఇప్పుడు ఉంది. వీరంతా కలసి ఇప్పుడు తెలంగాణలో ప్రజలు కోరుతు న్నట్టు చట్టబద్ధ పాలన కోసం ఉద్యమించాలి. ప్రజాస్వా మ్యం కాబట్టి ప్రభుత్వ చర్యల పట్ల నిరసనను ప్రకటించే హక్కును నిలబెట్టుకోవాలి. ప్రజా సంఘాల సమావేశపు హక్కును, స్వేచ్ఛగా మాట్లాడే హక్కును అంతా కాపాడు కోవాలి. అప్పుడే ప్రతిపక్ష నేతలకూ, పార్టీలకూ కూడా ఆ హక్కు మిగిలి ఉంటుంది.
(వ్యాసకర్త పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) మొబైల్: 84998 54214
- చిలుకా చంద్రశేఖర్