
ఇరోం షర్మిల విడుదల.. మళ్లీ దీక్ష
ఇంఫాల్: సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాల) చట్టాన్ని రద్దుచేయాలన్న డిమాండ్‌తో 14 ఏళ్లుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఇరోం షర్మిలను గురువారం ఇంఫాల్ జ్యుడీషియల్ కోర్టు విడుదల చేసింది. షర్మిలపై మోపిన ఆత్మహత్యాయత్నం అభియోగాలను కోర్టు తిరస్కరించింది. షర్మిల ఆత్మహత్యకు యత్నించారన్న దానిపై ప్రాసిక్యూషన్ ఎలాంటి ఆధారాలను సమర్పించలేకపోయిందని కోర్టు తెలిపింది. గురువారం సాయంత్రం విడుదలైన షర్మిల స్థానిక మార్కెట్‌లోని ఓ షెడ్‌లో తిరిగి నిరాహార దీక్షకు కూర్చున్నారు.