
జననేత దీక్షకు సంఘీభావం తెలపండి
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నారు. సమన్యాయం పాటించకుండా రాష్ట్రాన్ని దారుణంగా విభజించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్టు విభజిస్తే భవిష్యత్లో నీటి యుద్ధాలు తప్పవని ఆయన హెచ్చరించారు.
విభజనకు వ్యతిరేకంగా తాను రేపటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట చేపట్టబోతున్న ఆమరణ నిరాహార దీక్షకు అన్ని పార్టీలూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. అన్ని పార్టీల నాయకులూ వాళ్ల జెండాలు పట్టుకునే ఈ ఉద్యమంలో పాల్గొనాలని సూచించారు. జగన్ దీక్షపై మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. జననేత దీక్షకు సంఘీభావం ప్రకటించండి.