
కల్వకుర్తి డివిజన్ చేయకుంటే రాజీనామా
ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి
హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ సాధనకు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహారదీక్షకు పూనుకుంటే దాన్ని పోలీసులు భగ్నం చేశారని, తమ ప్రాంత ప్రజల కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి అన్నారు. తాను టీఆర్‌ఎస్ లోకి వెళితే రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తారని కొంతమంది సలహాలు ఇస్తున్నారని, తాను పదవికి రాజీనామా చేసినా పార్టీ మరే ప్రసక్తే లేదని చెప్పారు. అవసరమైతే తాను ఎన్నికల్లో పోటీ చేయకుండా టీఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతు పలుకుతానన్నారు.