ప్రజాస్వామ్యానికి ‘చంద్ర’గ్రహణం
రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించుకోగల అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్న చంద్రబాబు ప్రభుత్వం.. ప్రజల ఆకాంక్షకు అద్దంపడుతున్న ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణను సహించలేకపోతోంది.
‘‘రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవా లని చూసేవారి ఆటలు సాగ వ్. ఎవరైనా సరే... అరాచకా లకు పాల్పడితే అణచివేస్తాం. మీరు రాష్ట్రాభివృద్ధికి కలిసి వస్తే సంతోషం. కోలుకునే పరి స్థితుల్లో రాష్ట్రాన్ని దెబ్బకొట్టవ ద్దు. గతంలో రౌడీలను ఎలా పారద్రోలామో అలాగే వ్యవ హరిస్తాం. రాజీపడం’’ ఇది స్వయానా రాష్ట్ర ముఖ్య మంత్రిగారి బెదిరింపు హెచ్చరిక. ప్రధాన ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం తలపెట్టిన నిరవధిక నిరాహారదీక్షను ఉద్దేశిస్తూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 25న విజయవాడలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వాడిన తీవ్ర పదజాలం. దీనికి ఒక రోజు ముందు, సెప్టెంబర్ 24న న్యూఢిల్లీలో మీడియాతో తీవ్రస్వరంతో దీక్ష చేసి ప్రాణం తీసుకుంటానంటే పర్మిషన్ ఇవ్వాలా? రోడ్డు మీద కూర్చొని దీక్ష చేస్తే ఊరుకోవాలా? అంటూ అసహనం వ్యక్తం చేశారు.
ఆయన మాటలు విన్న ప్పుడు... ఎట్టి పరిస్థితుల్లోనూ వై.ఎస్. జగన్ దీక్ష చేయ టానికి అంగీకరించం అనే పట్టుదల కనిపించింది. రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం నిరవధిక నిరాహారదీక్షకు సిద్ధమైన ప్రధాన ప్రతిపక్షనేతను ఉద్దేశిస్తూ బాధ్యతగల సీఎం ఇటువంటి పరుష పదజాలంతో హెచ్చరికలు చేయడం గతంలో ఎప్పుడూ వినలేదు... చూడలేదు. ప్రతిపక్ష నేత ఏ పరిస్థితుల్లో నిరవధిక నిరాహార దీక్షకు కూర్చోవలసి వచ్చిందో గ్రహించడానికి... అర్థం చేసుకోవడానికి అధికార పార్టీ సిద్ధంగా లేదు. నవ్యాంధ్ర 16 నెలలపసిబిడ్డ అని, ఎన్నోకష్టాలు, ఇబ్బందులు పడు తూ పెంచుకుంటూ వస్తున్నామని, ఇప్పుడు బురదజ ల్లితే రాష్ట్రానికి ప్రజలకు నష్టమని ముఖ్యమంత్రి చంద్ర బాబు అదే మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. సీఎం చెప్పినట్లు కొత్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నో కష్టాలు ఎదుర్కొంటోంది. అందులో మరో అభిప్రాయా నికి తావులేదు. అయితే, ఇందులో కొన్ని సమస్యలు విభజనవల్ల సంక్రమిస్తే... మిగతావి తెలుగుదేశం ప్రభు త్వ అనాలోచిత విధానాల వల్ల వచ్చిపడినవి.
అటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి ప్రత్యేక హోదా సంజీవనిగా ఉపయోగపడుతుంది. అందుకే రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటు చర్చల మేరకు, ఆఖరి యూపీఏ కేబినెట్ నిర్ణయాల మేరకు, ఆనాటి బీజేపీ, టీడీపీల ఎన్నికల వాగ్దానాల మేరకు రావాల్సిన ప్రత్యేక హోదాను సాధించుకుందామని ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా విజ్ఞప్తి చేస్తున్నారు.
అయితే 16 నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న ఉదాసీన వైఖరి, అసలు ప్రత్యేక హోదా అవసరం లేదం టూ చేస్తున్న వాదనల కారణంగా ప్రజాబాహుళ్యంతో ఏర్పడిన భయాందోళనల్ని దృష్టిలో పెట్టుకొని ప్రధాన ప్రతిపక్షనేత నిరసన దీక్షకు పూనుకుంటే దానిని బురద జల్లుడు కార్యక్రమంగా చిత్రీకరిస్తున్న వైఖరిని ఏ విధం గా అర్థం చేసుకోవాలి? ప్రజల్లో బలంగా ఉన్న ప్రత్యేక హోదా సెంటిమెం టుపై టీడీపీ మౌనం ప్రదర్శించడంపై వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షం నిలిచి పోరాడటం ప్రభుత్వానికి కంటగిం పైంది. ఆత్మరక్షణలో పడిన పాలక ప్రభుత్వం ఎదురుదా డికి దిగే క్రమంలో ప్రజాస్వామ్య విలువలను తోసిరాజ నడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. వ్యక్తిగత కారణాలు, రాజ కీయ ఇబ్బందులు, సంకీర్ణ మొహమాటాలతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోగల అవకాశాన్ని టీడీపీ ప్రభు త్వం చేజేతులా జారవిడుచుకుంది. ప్రత్యేక హోదాకంటే ప్యాకేజీయే మేలు అంటూ కొత్త పల్లవి ఎత్తుకున్న చంద్ర బాబు చిత్తశుద్ధిని ప్రజలు శంకిస్తున్నారు.
ప్రజల విశ్వా సం కోల్పోతున్నామన్న ఉక్రోషంతో ప్రతిపక్ష పార్టీలను చులకన చేసి మాట్లాడటం, తామెలా వ్యవహరించినా, ఏం మాట్లాడినా, ఏ నిర్ణయాలు తీసుకున్నా ప్రశ్నించ డానికి మీరెవరు? అనడం అహంకారానికి, నియంతృత్వ ధోరణికి పరాకాష్ట. ప్రతిపక్ష నేతలకు అభివాదం చేసిన జవహర్‌లాల్ నెహ్రూ కానీ, ప్రతిపక్ష పార్టీలకు తగిన గౌరవమిచ్చిన దివంగత ఎన్టీఆర్ కానీ ఎన్నడూ అప్రజాస్వామిక చర్య లను ప్రోత్సహించలేదు. ప్రతిపక్షానికున్న ప్రాముఖ్య తను, దాని రాజ్యాంగ హక్కులను గౌరవించే విజ్ఞతను టీడీపీ ప్రభుత్వం కోల్పోయింది. కానీ ప్రజాస్వామ్య సంప్రదాయాలను గాలికొది లేసిన పెడధోరణులు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో చూడగ లుగుతున్నాం. పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి అధికా రంలోకి రాగానే... ప్రధాన ప్రతిపక్షం వాణి వినబడ కుండా గొంతు నొక్కేయడానికి ప్రయత్నించడం; అదే సమయంలో, చట్టాన్ని అతిక్రమిస్తున్న సొంత పార్టీ ఎమ్మెల్యేలను, నేతలను పరిరక్షించుకొనేందుకు రాజ్యాం గ విలువలను బాహాటంగా కాలరాస్తున్న తీరును సమా జం గమనిస్తూనే ఉంది.
ప్రజల మేలు కోసం రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని అవమానాలు తాత్కాలికంగా భరించకతప్పదు. చరిత్ర అందించే విలువైన పాఠాలను తెలుసుకొని టీడీపీ ప్రభుత్వం, నాయకత్వం... ప్రతిపక్ష పార్టీలకు సముచిత గౌరవం ఇవ్వగలిగితేనే... సమష్టి పోరాటాల ద్వారా రాష్ట్రానికి చెందవలసిన వాటిని సాధించగలిగితేనే... రాష్ట్రంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది తప్ప అణచివేత విధానాల వల్ల, ప్రజాస్వామ్య వెక్కిరింపుల వల్ల ఫలితం ఉండదు. ప్రజాస్వామ్యం మనుగడ సాధిం చదు... ప్రజలు హర్షించరు. రాష్ట్రం పురోగమించదు.
వ్యాసకర్త: ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రివర్యులు
మొబైల్: 99890 24579
- డా.ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు