
రెండో రోజుకు చేరిన వైఎస్ జగన్ నిరవధిక దీక్ష
గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, ఉన్న జాబులను తీసేశారని ఆయన మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై సీఎం పూటకోమాట మాట్లాడుతున్నారని గుర్తుచేశారు.
ప్రత్యేక హాదా కావాలని వీధివిధినా మాట్లాడిన బాబు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో రోజు కూడా దీక్షా స్థలానికి భారీ ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం బుధవారం గుంటూరులోని నల్లపాడులో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన విషయం విదితమే.