వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమరణ దీక్షకు మద్దతుగా కొవ్వూరు మండలం దొమ్మేరులో రాష్ట్ర ఎంపీటీసీల సంఘం మాజీ అధ్యక్షుడు ముదునూరి నాగరాజు మంగళవారం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు.
దొమ్మేరు (కొవ్వూరు), న్యూస్‌లైన్ : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమరణ దీక్షకు మద్దతుగా కొవ్వూరు మండలం దొమ్మేరులో రాష్ట్ర ఎంపీటీసీల సంఘం మాజీ అధ్యక్షుడు ముదునూరి నాగరాజు మంగళవారం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ఆయనకు సంఘీభావంగా పార్టీ నాయకులు రిలే నిరాహార దీక్ష చేశారు. మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ నాగరాజుకు పూలమాల వేసి దీక్షను ప్రారంభించారు.
రాజమండ్రి పార్లమెంటకీ నియోజకవర్గ నాయకుడు బొడ్డు వెంకట రమణ చౌదరి, మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పరిమి హరిచరణ్, మండల కన్వీనర్ ముళ్లపూడి కాశీవిశ్వనాథ్, రాష్ట్ర దళిత విభాగం నాయకుడు ముప్పిడి విజయరావు, నాయకులు వరిగేటి సుధాకర్, సుంకర సత్యనారాయణ, ముదునూరి సూర్యనారాయణరాజు, కోడూరి సత్యనారాయణ (సత్తులు), కుంటముక్కల రాంబాబు, ఎంఎస్ రాజు, పీతల ప్రసాద్‌బాబుతోపాటు పలువురు మండల నాయకులు దీక్షా శిబిరానికి వెళ్లి నాగరాజుకు సంఘీభావం తెలిపారు. వెంకట రమణ చౌదరి మాట్లాడుతూ సమైక్యాంధ్రప్రదేశ్‌ను విభజించాలంటే అన్ని ప్రాంతాల వారికి సమన్యాయం చేయాలని, లేనప్పుడు రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు.
జైలులోనే ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డికి అన్నివర్గాల ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి దీక్షకు మద్దతుగా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన నాగరాజును అభినందించారు. నాగరాజు మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి కోసం, సమైక్యాంధ్ర కోసం తన ప్రాణాలైనా అర్పిస్తానని తెలిపారు. నాగరాజు సతీ మణి, దొమ్మేరు సర్పంచ్ ముదునూరి జ్ఞానేశ్వరి, పలువురు వార్డుసభ్యులు నాగరాజుకు సంఘీభావం తెలిపారు. నాగరాజు దీక్షకు మద్దతుగా దొమ్మేరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తొర్లపాటి చంద్రశేఖర్, డేగపాటి సురేష్, సుంకర పైడేశ్వరరావు, మరపట్ల రాధాకృష్ణ, బోడిగట్ల జాకి, కొయ్య ప్రేమ్‌కుమార్, బోడిగట్ల శ్యాం, డేగపాటి శ్రీనివాస్ తది తరులు దీక్షలో కూర్చున్నారు. వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్ మైపాల రాంబాబు, నాయకులు వల్లిపల్లి సాయి, చిలంకుర్తి బాబిలతోపాటు పలువురు నాయకులు నాగరాజు దీక్షకు సంఘీభావం తెలిపారు.