
వైఎస్ జగన్ కు మరోసారి వైద్య పరీక్షలు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించడం కోసం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గురువారం రాత్రి మరోసారి వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఏపీ ప్రత్యేక హోదా కోరుతూ ఆయన బుధవారం గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు.
దీంతో వైఎస్ జగన్ చేపట్టిన దీక్ష నేటికి రెండో రోజుకు చేరుకోవడంతో ఆయనకు రెండోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈరోజు ఉదయం వైఎస్ జగన్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.