Published
Fri, Aug 19 2016 12:22 AM
| Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
గౌడ కులస్తులు ఐక్యంగా ఉండాలి
నల్లగొండ టూటౌన్: గౌడ కులస్తులందరూ ఐక్యంగా ఉండి తమ హక్కులు సాధించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక హైదరాబాద్ రోడ్డులోని గౌడ హాస్టల్‌లో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 366వ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తమ కుల వృత్తితో పాటు బడుగ, బలహీనవర్గాల అభ్యున్నతికి పోరాడిన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. బడుగుబలహీనవర్గాలు రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు తండు సైదులుగౌడ్ , ప్రధాన కార్యదర్శి పానుగంటి వెంకన్నగౌడ్ మాట్లాడుతూ గౌడుల ఐక్యత ద్వారానే రాజ్యాధికారం సాధించగలమని, జిల్లాలో ఉన్న 59 మండలాల్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతకుముందు పలువురు నాయకులు సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు సుంకరి మల్లేష్‌గౌడ్, సోమగాని శంకర్‌గౌడ్, కటికం సత్తయ్యగౌడ్, పల్లె రవికుమార్, మాదగొని శ్రీనివాస్‌గౌడ్, రవీందర్‌గౌడ్, కాశయ్యగౌడ్, యాదగిరిగౌడ్, బాదిని నర్సింహగౌడ్, భిక్షంగౌడ్, టి.యాదగిరిగౌడ్, సోమశేఖర్ గౌడ్, చెనగోని సతీష్ గౌడ్, వర్కాల లక్ష్మీనారాయణగౌడ్, గండుచెర్వు వెంకన్నగౌడ్, బాలనర్సింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.