సీఎం మనసు గెలిచిన సినిమా... | Nil Battey Sannata movie declared tax free in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

సీఎం మనసు గెలిచిన సినిమా...

Published Thu, Apr 21 2016 5:36 PM | Last Updated on Sun, Sep 3 2017 10:26 PM

సీఎం మనసు గెలిచిన సినిమా...

సీఎం మనసు గెలిచిన సినిమా...

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఓ హిందీ మూవీకి భారీ ఆఫర్ ప్రకటించారు. అశ్వినీ అయ్యర్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ మూవీ 'నిల్ బట్టి సన్నాట' పై తమ రాష్ట్రంలో పన్ను విధించడంలేదని ప్రకటించారు. ఈ మూవీని ఆగ్రాలో చిత్రీకరించారు. స్వర భాస్కర్, రత్న పథక్, పంకజ్ త్రిపాఠి ముఖ్యపాత్రధారులుగా ఈ మూవీలో కనిపించనున్నారు. ఈ మూవీ శుక్రవారం విడుదలకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం అఖిలేష్ మూవీపై పన్నును సడలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వివరాలను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

అశ్వినీ అయ్యర్ తివారీ  దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తనకు చాలా నచ్చిందని సీఎం అఖిలేష్ రాసుకొచ్చారు. తల్లీకూతుళ్లకు సంబంధించిన ఈ కథ అందరిని ఆకర్షిస్తుందని, మన కలల్ని సాకారం చేసుకోవడానకి వయసు అనేది అడ్డంకి కాదని పేర్కొన్నారు. చాలా అరుదుగా ఇలాంటి స్టోరీతో మూవీలు వస్తాయంటూ ఆయన మెచ్చుకున్నారు. ఆనంద్ ఎల్ రాయ్, రాంజానా ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement