జాతిపితకు మోడీ, సోనియా నివాళులు | Narendra modi, sonia gandhi visits Rajghat, pays tributes to Gandhi | Sakshi
Sakshi News home page

జాతిపితకు మోడీ, సోనియా నివాళులు

Published Thu, Oct 2 2014 8:19 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

జాతిపితకు మోడీ, సోనియా నివాళులు - Sakshi

జాతిపితకు మోడీ, సోనియా నివాళులు

న్యూఢిల్లీ : జాతిపిత మహాత్మాగాంధీ 145వ జయంతి సందర్భంగా ఆయనకు దేశప్రజలు గురువారం ఘనంగా నివాళులు అర్పించింది. ఆయనకు  ప్రముఖలు అంజలి ఘటించారు.  దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తదితరులు బాపూజీకి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మహాత్ముడి సేవలను స్మరించుకున్నారు. జాతిపిత జయంతి సందర్భంగా రాజ్‌ఘాట్‌లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.

మరోవైపు గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్‌పై ప్రచార కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది.  ఈ సందర్భంగా ఆయన స్వయంగా చీపురు చేతపట్టి మురికివాడల్ని శుభ్రం చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement