
మహాత్ముడికి నరేంద్ర మోడీ ఘన నివాళి
న్యూఢిల్లీ : భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోడీ భారత జాతిపిత మహాత్మ గాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన సోమవారం ఉదయం రాజ్ఘాట్ సందర్శించి మహాత్మాగాంధీ సమాధి వద్ద అంజలి ఘటించారు. అనంతరం ఆయన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి నివాసానికి బయల్దేరారు. మోడీ ఆయన ఆశీర్వాదం తీసుకోనున్నారు.
కాగా స్వతంత్ర భారతదేశ 14వ ప్రధానమంత్రిగా నరేంద్రభాయి దామోదరదాస్ మోడీ(63) ఈ రోజు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సాయంత్రం ఆరు గంటలకు మోడీచే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణస్వీకారం చేయిస్తారు.