
సాక్షి,హైదరాబాద్: పోరాట యోధుడిగా ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిన యోధుడు మహాత్మాగాంధీ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బుధవారం(అక్టోబర్2) గాంధీజయంతి సందర్భంగా తెలంగాణభవన్‌లో జాతిపితకు కేటీఆర్ నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ‘ప్రపంచం మొత్తం విశ్వగురువుగా కీర్తించిన నేత గాంధీ.మార్టిన్ లూథర్ కింగ్‌కు కూడా మహాత్మా గాంధీ ఆదర్శంగా నిలిచారు. తెలంగాణలో పేదల పట్ల ప్రభుత్వం మానవీయంగా వ్యవహరిస్తోంది.మమ్మల్ని వేరే పని అని తీసుకువచ్చి ఇల్లు కూలగొట్టమంటున్నారని కూలీలు చెప్తున్నారు.
మీకు ఓట్లు వేసింది ఇళ్ళు కూలగొట్టడానికి కాదు. ఈ విషయంలో పైన ఢిల్లీలో ఉన్న గాంధీలు సోనియాగాంధీ,రాహుల్ గాంధీ ఆలోచించాలి. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి’అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: అక్రమమైనా.. ఇళ్ల జోలికి వెళ్లం: రంగనాథ్
Comments
Please login to add a commentAdd a comment