ఘాట్‌రోడ్డు జంక్షన్ బస్ షెల్టరు వద్ద మాంసం విక్రయిస్తున్న దృశ్యం
విశాఖపట్నం, చోడవరం టౌన్: నియమ నిబందలకు విరుద్దంగా మంగళవారం పట్టణంతో పాటు గ్రామాల్లోని చేపలు, మాంసం, మద్యం యథేచ్ఛగా విక్రయించారు. గాంధీజయంతి రోజున, స్వాతంత్య్ర దినోత్సవం రోజున మద్య, మాంస విక్రయాలు చేయకూడదని నిబంధనలు ఉన్నా వ్యాపారులు ఖాతరు చేయడం లేదు. వాటిని అరికట్టాల్సిన పోలీసు యంత్రాంగం చూసీచూడనట్టు వదిలేసింది. ఎకె‡్ష్సౖజ్ పోలీసులు కూడా సోమవారం రాత్రి మద్యం దుకాణాలు సీళ్లు వేసినా వారు వేయక ముందే మద్యం వేరే చోటకు తరలించిన వ్యాపారులు వాటిని పాన్‌షాపుల వద్ద, టీదుకాణాల వద్ద విక్రయించారు. పట్టణంలోని ప్రధాన రహదారిమీద, గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ మాంసం విక్రయించారు.
యథేచ్ఛగా మాంసం విక్రయాలు
మాడుగుల రూరల్: జాతిపిత మహత్మా గాంధీ జయంతిని రోజున విచ్చలవిడిగా మాంసం, చేపలు, విక్రయాలు జోరుగా సాగాయి. అసలే మంగళవారం దీనికి తోడు జోరుగా మాంసం, చేపలు, విక్రయాలు సాగించారు. ఏజెన్సీ ప్రధాన కేంద్రం అయిన ఘాట్‌రోడ్డు జంక్షన్‌లో గొర్రె మాంసం, రెండు దుకాణాలల్లో విక్రయించారు. ఎం.కె.వల్లాపురం, సాగరం పంచాయతీ పరిధిలో గల ఈ ఘాట్‌రోడ్డు జంక్షన్‌లో ఈ విక్రయాలు చేస్తున్నా సరే ఎవరూ స్పందించలేదు. కె.జె.పురంలో మంగళవారం జరిగిన వారపు సంతలో కూడా చేపలు విక్రయాలు చేపట్టారు. చేపలు విక్రయాలు చూసిన పంచాయతీ జూనియర్ సహాయకులు ఎ.శ్రీనివాస్, అప్పడుకప్పుడు విక్రయాలు నిలుపుదల చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment