సాక్షి, ముంబై: జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా స్టాక్‌మార్కెట్లకు ఈ రోజు (అక్టోబరు 2, బుధవారం) సెలవు. బాండ్, కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లు కూడా బుధవారం పనిచేయవు. మరోవైపు గాంధీ 150వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద ప్రధానమంత్రి, నరేంద్ర మోదీ,రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాళులర్పించారు. అటు ప్రపంచవ్యాప్తంగా కూడా బాపూజీని స్మరించుకుంటూ ఘన నివాళులర్పించారు. కాగా మంగళవారం ఆరంభంలోనే పాజిటివ్‌గా ఉన్నప్పటికీ మిడ్‌సెషన్ తదుపరి అమ్మకాలు ఊపందుకోవడంతో ఒక దశలో సెన్సెక్స్ 600 పాయింట్లు పడిపోయింది. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్, రియల్టీ రంగాలలో అమ్మకాలు షాక్ తగిలింది. చివరికి సెన్సెక్స్ 362 పాయింట్లు పతనమై 38305 వద్ద , నిఫ్టీ 115 పాయింట్లు కోల్పోయి 11359 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే.
राष्ट्रपिता महात्मा गांधी को उनकी 150वीं जन्म-जयंती पर शत-शत नमन।
— Narendra Modi (@narendramodi) October 2, 2019
Tributes to beloved Bapu! On #Gandhi150, we express gratitude to Mahatma Gandhi for his everlasting contribution to humanity. We pledge to continue working hard to realise his dreams and create a better planet. pic.twitter.com/4y0HqBO762
Comments
Please login to add a commentAdd a comment