సాక్షి, సినిమా : తనకు ఏమతం లేదనీ, తాను ఒక భారతీయుడినని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం గాంధీ జయంతి సందర్భంగా ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రత్యేక కార్యక్రమంలో సామాజిక వేత్త బిందేశ్వర్ పాఠక్ అడిగిన ప్రశ్నకు అమితాబ్ పై విధంగా స్పందించారు. అంతేకాక, బచ్చన్ అనే పేరు నిజానికి తమ ఇంటి పేరు కాదని తమ ఇంటి పేరు శ్రీవాస్తవ అని వెల్లడించారు. తన తండ్రి హరివంశరాయ్ తనను స్కూల్‌లో జాయిన్ చేసినప్పుడు ఇంటి పేరు శ్రీవాస్తవ అని కాకుండా తన కలం పేరైన బచ్చన్ అని రాయించారని, దాంతో తనకు అదే పేరు స్థిరపడిపోయిందని వెల్లడించారు. అంతేకాక, బచ్చన్ అనే పేరు ఏమతాన్నీ సూచించదని చెప్పుకొచ్చారు.
మరోవైపు అమితాబ్ కుటుంబ సంప్రదాయం ప్రకారం కుటుంబ పెద్దకు రంగులు పూసిన తర్వాతే హోళీ పండుగను ప్రారంభిస్తారు. ఈ విషయం గురించి అడుగగా, కుటుంబ సంప్రదాయం ప్రకారం ఇంట్లోని పెద్ద మనిషికి ఆ రకంగా గౌరవం ఇస్తామని స్పష్టం చేశారు. తన తండ్రి ఐతే ఇంట్లో టాయిలెట్లను శుభ్రం చేసే వ్యక్తి పాదాలకు రంగు పూసి ఆ తర్వాతే పండుగను జరుపుకుంటారని తెలిపారు. ఈ విషయంలో మాకెలాంటి సిగ్గూ అనిపించదని అమితాబ్ పేర్కొన్నారు. కాగా, అమితాబ్ బచ్చన్‌కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం అత్యున్నత సినీ పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment