
గాంధీ, లాల్‌బహుదూర్ శాస్త్రి చిత్రపటాల వద్ద నివాళులర్పిస్తున్న ఉమ్మారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, పార్టీ నేతలు వాసిరెడ్డి పద్మ, పుత్తా ప్రతాప్ రెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి వారు చేసిన సేవలను ఈ సందర్భంగా నేతలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, రాష్ట్ర కార్యదర్శి పుత్తా ప్రతాప్‌రెడ్డి, పార్టీ నేత సాగి దుర్గాప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు.