గత కొన్నిరోజుల నుంచి ప్రకాశ్ రాజ్-పవన్ కల్యాణ్ మధ్య ట్విటర్ వార్ నడుస్తూనే ఉంది. తిరుపతి లడ్డూ విషయమై మొదలైన ఈ రచ్చ కాస్త ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తప్పు ఎక్కడ జరిగింది? ఎవరు చేశారనేది పక్కనబెట్టి కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని చంద్రబాబు దెబ్బతీశారు. ఈయనకు వంతపాడటం అన్నట్లు లడ్డూ వ్యవహారాన్ని రాజకీయాంగా ఉపయోగించుకోవాలని ఉద్దేశంతో రెచ్చగొట్టేలా పవన్ పలు కామెంట్స్ చేశారు.
(ఇదీ చదవండి: కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ?.. డిప్యూటీ సీఎం పవన్‌పై వ్యంగ్యాస్త్రాలు!)
గత కొన్నిరోజుల నుంచి పవన్‌ని సోషల్ మీడియాలో ఓ రేంజులో ఆడుకుంటున్న ప్రకాశ్ రాజ్.. మరోసారి సెటైరికల్ ట్వీట్ వేశాడు. గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వాళ్లు చెప్పిన కొటేషన్స్ చెబుతూ పవన్‌పై కౌంటర్ వేశాడు.
'నువ్వు మైనారిటీవి అయినా నిజం ఎప్పటికీ నిజమే -మహాత్మా గాంధీ. మనకు దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలు ఉన్నాయి. కానీ వీటిని ఎప్పుడూ రాజకీయాల్లోకి తీసుకురాలేదు. ఇదే భారత్, పాకిస్థాన్‌ల మధ్య తేడా. -లాల్ బహదూర్ శాస్త్రి. మీ అందరికీ #గాంధీ జయంతి #లాల్ బహదూర్ శాస్త్రి జయంతి శుభాకాంక్షలు … ఈ సత్యాన్ని మనందరిలో నింపనివ్వండి జస్ట్ ఆస్కింగ్' అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఫీల్ గుడ్ మూవీ.. ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిందే!)
Wishing you all happy #GandhiJayanti #LalBahadurShastriJayanti … Let this TRUTH sink into all of us 🙏🙏🙏 #justasking pic.twitter.com/AQV92znBHc
— Prakash Raj (@prakashraaj) October 2, 2024
Comments
Please login to add a commentAdd a comment