
గజ్వేల్: గాంధీ మహాత్ముడు చూపిన మార్గంలో సత్యాగ్రహాన్ని ఆయుధంగా మలచుకొని సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించగలిగారని, నేడు ఆ మహనీయుని బాటలో ముందుకెళ్తూ.. 30 రోజుల ప్రణాళిక అమలు తో ‘స్వచ్ఛ తెలంగాణ’కు బాటలు వేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ కోర్టు వద్ద ఆర్యౖ వెశ్య సంఘం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని బుధవారం ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలసి ఆవిష్కరించారు. గాంధీ చూపిన బాటలో పయనించినపుడే ఆయనకు నిజమై న నివాళి అర్పించినట్లవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ భూపతిరెడ్డి, టీఆర్‌ఎస్ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, ‘గడా’ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment