అనుష్క–విజయ్‌– ఓ సినిమా? | Anushka to act with Vijay Devarakonda Next | Sakshi
Sakshi News home page

అనుష్క–విజయ్‌– ఓ సినిమా?

Published Tue, Oct 6 2020 12:12 AM | Last Updated on Tue, Oct 6 2020 6:21 AM

Anushka to act with Vijay Devarakonda Next - Sakshi

అనుష్క నటించిన తాజా చిత్రం ‘నిశ్శబ్దం’ ఈ నెల 2న విడుదలైన విషయం తెలిసిందే. మరి.. ఆమె చేయబోయే తదుపరి చిత్రాలేంటి? అంటే.. విజయ్‌ దేవరకొండ–అనుష్క కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుందనే వార్త వినిపిస్తోంది. ఒక ఆసక్తికరమైన కథతో ఈ చిత్రం తెరకెక్కనుందట. ఈ కథకి అనుష్క, విజయ్‌ కరెక్ట్‌గా సరిపోతారని దర్శక–నిర్మాతలు సంప్రదించారట. కథ నచ్చి ఇద్దరూ అంగీకరించారని సమాచారం. ఇటీవల ట్విట్టర్‌లో అభిమానులతో అనుష్క చాట్‌ చేస్తూ.. రెండు కొత్త సినిమాలను అంగీకరించానని, త్వరలోనే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటనలు వస్తాయని అన్నారు. ఆ రెండు చిత్రాల్లో విజయ్‌–అనుష్క కాంబినేషన్‌ ఒకటి అని, ఈ సినిమాని ఒక కొత్త దర్శకుడు తెరకెక్కిస్తారని టాక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement