బెస్ట్‌ ఛాయిస్‌ స్వీటీయేనా? | anushka is best of prabas next movie? | Sakshi
Sakshi News home page

బెస్ట్‌ ఛాయిస్‌ స్వీటీయేనా?

Jun 13 2017 1:37 AM | Updated on Sep 5 2017 1:26 PM

బెస్ట్‌ ఛాయిస్‌ స్వీటీయేనా?

బెస్ట్‌ ఛాయిస్‌ స్వీటీయేనా?

టాలీవుడ్‌లో హిట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న నటీనటుల్లో ప్రభాస్, అనుష్క జంట ఒకటి.

టాలీవుడ్‌లో హిట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న నటీనటుల్లో ప్రభాస్, అనుష్క జంట ఒకటి.  ఇప్పటి వరకూ వీరిద్దరూ కలిసి నాలుగు చిత్రాలలో నటించారు. అవన్నీ విజయాలు సాధించడం విశేషమే. బిల్లా చిత్రంతో కలిసిన ఈ జంట బాహుబలి– 2 వరకూ సక్సెస్‌ఫుల్‌గా సాగింది. ఈ క్రేజీ జంటపై ప్రేమ వదంతులకు ఇది కూడా ఒక కారణం కావచ్చు. వీరి మధ్య ఏదో ఉందనే ప్రచారం మీడియాలో హోరెత్తుతోంది. ఇప్పటి వరకూ దక్షిణాదికే పరిమితం అయిన ప్రభాస్, అనుష్క క్రేజ్‌ బాహుబలి– 2తో ప్రపంచస్థాయికి చేరింది. ఇకపోతే బాహుబలి ఫీవర్‌ నుంచి బయట పడ్డ ప్రభాస్‌ సాహో చిత్రానికి సిద్ధం అయ్యారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ సంస్థ రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తోంది.

ఇంతకు ముందు లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం శనివారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకుంటోంది. అయితే ఇప్పటికీ ఇందులో నటించే నాయకి ఎంపిక జరగలేదు. ఇది త్రిభాషా చిత్రం కావడంతో బాలీవుడ్‌ బ్యూటీ అయితే బాగుంటుందని చిత్ర వర్గాలు భావించినట్లు సమాచారం. అయితే సాహో చిత్రంలో నటించడానికి బాలీవుడ్‌ భామలెవరూ సెట్‌ కానట్టుంది. కొందరు కాల్‌షీట్స్‌ సమస్య కారణంగా అంగీకరించలేదని, మరి కొందరు అధిక పారితోషికం డిమాండ్‌ చేయడంతో వారిని దర్శక, నిర్మాతలు పక్కన పెట్టినట్లు ప్రచారం జరిగింది. దీంతో సాహోలో ప్రభాస్‌ పక్కన అనుష్కనే బెస్ట్‌ ఛాయిస్‌ అనే భావనకు ఆ చిత్ర వర్గాలు వచ్చినట్లు తాజా సమాచారం.

బాహుబలి– 2 తరువాత ఈ బ్యూటీ మరో కొత్త చిత్రాన్ని అంగీకరించలేదు. అంతకు ముందు ఒప్పుకున్న భాగమతి చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉంది. దీంతో బాహుబలి చిత్ర క్రేజ్‌ను సాహో చిత్ర యూనిట్‌ వాడుకోవడానికే సిద్ధం అయినట్లు సినీ వర్గాల సమాచారం. అయితే దీని గురించి అధికార పూర్వక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement