... ఇదిగో ఇలాగే చెప్పారు దేవసేన. అదేనండీ అనుష్క. అదేంటీ? దేవసేన మీద భల్లాలదేవుడు (రానా) పగ సాధించాలనుకున్నాడు కదా! బాహుబలి (ప్రభాస్)తో దేవసేన వివాహం అయ్యింది కదా అంటే.. అవును. అవి రీల్ లైఫ్ క్యారెక్టర్స్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ రియల్ లైఫ్‌లో ప్రభాస్, రానా, అనుష్కల బాండింగ్ వేరు. ఆ అనుబంధం గురించి అనుష్క స్వయంగా చెప్పారు. ‘పిల్ల జమీందార్’ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మించిన ‘భాగమతి’లో అనుష్క టైటిల్ రోల్ చేసిన విషయం తెలిసిందే.
ఈ నెల 26న ఈ చిత్రం రిలీజ్ కానుంది. చెన్నైలో జరిగిన తమిళ ‘భాగమతి’ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న అనుష్క కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ‘‘రానా నన్ను బ్రదర్ అని పిలుస్తాడు. నేనూ తనని అలాగే పిలుస్తాను. ప్రభాస్ నాకు బ్రదర్ కాదు. బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే. అయినా అందరూ బ్రదర్స్ అవ్వాలనేం లేదుగా?’’ అన్నారామె. పెళ్లి గురించి మాట్లాడుతూ – ‘‘పెళ్లి గురించిన ఆలోచన ప్రస్తుతానికి లేదు. మీకు తెలిసిన అబ్బాయి ఎవరైనా ఉంటే చెప్పండి. (నవ్వుతూ).
నా నెక్ట్స్ సినిమా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఉండొచ్చు. రాజమౌళి దర్శకత్వంలో మరోసారి నటించాలని ఉంది’’ అన్నారు అనుష్క. భాగమతి సినిమా గురించి చెబుతూ– ‘‘ఇందులో సంచల అనే ఐఏఎస్ అమ్మాయి క్యారెక్టర్ చేశాను. నిజానికి ఈ కథను నేను 2012లో విన్నా. కానీ లింగా, సైజ్ జీరో, బాహుబలి 1 అండ్ 2 సినిమాలను ముందు కమిట్ అయ్యాను. సో.. మేకర్స్ నాకోసం ఫోర్ ఇయర్స్ వెయిట్ చేశారు. ‘భాగమతి’ ట్రూ స్టోరీ కాదు. ఫిక్షన్. దర్శకుడు అశోక్ సినిమాను బాగా తీశారు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment