ప్రముఖ టీవీ షో బాల్ వీర్‌లో నటించి పాపులర్ అయిన యువ నటి అనుష్క సేన్ ఒక కొత్త లగ్జరీ ఇల్లును కొనుగోలు చేసింది. ఈ మేరకు అనుష్క తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో అందమైన ఫోటోలను షేర్ చేసింది.. సేన్ ఫ్యామిలీ.. కొత్త ఇల్లు. మరో కల నెలవేరింది అంటూ ముంబైలో తన కొత్తింటోల అమ్మానాన్నలతో పోజిలిచ్చిన స్నాప్‌షాట్ ఫోటోలను అభిమానులకు పంచుకుంది. దీంతో ఫ్యాన్స్ ఆమెకు అభినందనలు తెలిపారు.
విలాసవంతమైన ఇంటి ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అంతేకాదు చక్కటి ఇంటీరియర్స్ , అత్యుధునికి ఫీచర్స్‌తో ఉన్న ముంబై స్కైలైన్ ఫ్లాట్ అదిరి పోతోంది. అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు కరియర్‌లో ఒక్కో మెట్టూ ఎక్కుతోంది. ఈ క్రమంలో18 ఏళ్లకే రూ.55 లక్షల విలువ చేసే (2020లో) బిఎమ్‌డబ్ల్యూ స్పోర్ట్స్ లిమిటెడ్ ఎడిషన్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ యువ టీవీ నటి మెహర్ పాత్రతో ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ జీవిత విశేషాలను తన అనుచరులతో పంచుకుంటుంది. ఇటీవల,పాపులర్ బ్రాండ్ జైపురి అదాహ్‌కు చెందిన అద్భుత జైపురి సూట్ ఫోటోలతో తన అభిమానులకు బ్యూటిఫుల్ ట్రీట్ ఇచ్చింది.
అనుష్క సేన్ 2009లో యహా మై ఘర్ ఘర్ ఖేలీ సీరియల్‌తో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. అదే సంవత్సరం, ఆమె తన మొదటి మ్యూజిక్ వీడియో హమ్కో హై ఆషాతో తనదైన ముద్ర వేసింది. 2015లో క్రేజీ కుక్కాడ్ ఫ్యామిలీ చిత్రంలో అనుష్క ఒక పాత్రతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. దీంతోపాటు స్టంట్ ఆధారిత రియాలిటీ టీవీ షో ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 11లో తన టాలెంట్‌ను అందర్నీ మెస్మరైజ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment