ఐటం సాంగ్‌కు 2సీ! | Mahesh Babu is the heroine of the movie Anushka Single item Song 2 cror ! | Sakshi
Sakshi News home page

ఐటం సాంగ్‌కు 2సీ!

Published Thu, Jul 20 2017 1:00 AM | Last Updated on Tue, Sep 5 2017 4:24 PM

ఐటం సాంగ్‌కు 2సీ!

ఐటం సాంగ్‌కు 2సీ!

నటి అనుష్క సింగిల్‌ సాంగ్‌కు రూ. 2 కోట్లు పారితోషికం పుచ్చుకుంటున్నారా? దీనికి అవుననే ప్రచారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

తమిళసినిమా: నటి అనుష్క సింగిల్‌ సాంగ్‌కు రూ. 2 కోట్లు పారితోషికం పుచ్చుకుంటున్నారా? దీనికి అవుననే ప్రచారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దక్షిణాదిలో అగ్ర కథానాయికల్లో ఒకరుగా విరాజిల్లుతున్న నటి అనుష్క.అయితే బాహుబలి–2 చిత్రం తరువాత ఆ సమయంలో అంగీకరించిన భాగమతి చిత్రం మినహా అమ్మడి చేతిలో చిత్రాలు లేవు.

దీంతో అంతగా ప్రపంచ సినిమాను తిరిగి చూసేలా చేసిన చిత్రం తరువాత అనుష్కకు అవకాశాలు రావడం లేదా అంటే వచ్చిన వాటిని అనుష్కనే అంగీకరించడం లేదనే సమాధానం చిత్ర వర్గాల నుంచి వస్తోంది. దీంతో ఈ అమ్మడి గురించి రకరకాల ప్రచారాలు జోరందుకున్నాయి. అందులో ఒకటి పెళ్లి. అనుష్కకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, కుదిరితే త్వరలోనే అనుష్క ఇంట పీపీపీ..డుండుండుమ్మేననే ప్రచారం జరుగుతోంది.

అందుకు తగ్గట్టుగానే అనుష్క ఇటీవల గుళ్లు, గోపురాలు అంటూ చుట్టేశారు. తాజాగా అనుష్క ఒక టాలీవుడ్‌ చిత్రంలో సింగిల్‌సాంగ్‌ చేయడానికి సమ్మతించినట్లు, అది మహేశ్‌బాబు హీరోగా నటించనున్న భారత్‌ అనే నేను చిత్రం అని ప్రచారం హల్‌చల్‌ చేస్తోంది. అంతే కాదు ఈ పాటలో మహేశ్‌బాబుతో లెగ్‌షేక్‌ చేయడానికి అక్షరాలా రూ.2 కోట్ల పారితోషికాన్ని పుచ్చుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత అన్నది పక్కన పెడితే ఈ విషయమై సోషల్‌ మీడియాలో చాలా కాలంగా ప్రసారం సాగుతోంది.

అయితే అసలు మహేశ్‌బాబు తాజా చిత్రం ఇంకా ప్రారంభమే కాలేదన్నది గమనార్హం. ఇంతకు ముందు కూడా నటి తమన్నా రెండు, మూడు చిత్రాల్లో ఐటమ్‌ సాంగ్‌కు కోటి, రెండు కోట్లు డిమాండ్‌ చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ మధ్యనే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వారసుడు నటించిన జాగ్వర్‌ చిత్రంలో ఐటమ్‌సాంగ్‌ కోసం మిల్కీబ్యూటీ రెండు కోట్లు పుచ్చుకున్నట్లు ప్రచారం జోరుగా సాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement