
... అని ధైర్యంగా.. బాహాటంగా చెబుతున్నారు బెంగళూరు బ్యూటీ అనుష్క. ఈ జేజెమ్మ ప్రేమలో పడ్డారంటే ఏ హీరోతో? అనే డౌట్ రాకమానదు. కానీ, స్వీటీ ప్రేమలో పడ్డది సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాదు. క్రికెటర్ అట. ఇంతకీ ఎవరా లక్కీ పర్సన్? అతని గురించి తెలుసుకోవాలని ఆత్రుతగా ఉంది కదూ! అతను మరెవరో కాదు.. రాహుల్ ద్రావిడ్. అందం, అభినయంతో ఎంతో మందిని తన అభిమానులుగా మార్చుకున్న అనుష్కకు ద్రావిడ్ అంటే వీరాభిమానమట.
ఇప్పటి వరకూ తన మనసులో ఉన్న ఈ విషయాన్ని తొలిసారి బాహాటంగా చెప్పేశారీ దేవసేన. ‘‘చిన్నప్పటి నుంచి ఆయనంటే నాకు విపరీతమైన అభిమానం. ఆయన కోసమే క్రికెట్ చూసేందుకు టీవీ ముందు వాలిపోయేదాన్ని. ఒకానొక సమయంలో ఆయనతో పీకల్లోతు ప్రేమలో పడిపోయా. ఇప్పటికీ నా ఇష్టం అలాగే ఉంది. తను మరెవరో కాదు.. రాహుల్ ద్రావిడ్’’ అంటూ ముసిముసి నవ్వులు నవ్వుతూ తన మనసులో మాట బయటపెట్టారు అనుష్క.
Comments
Please login to add a commentAdd a comment