అనుష్క
రావడం రావడమే అనుష్క ‘సూపర్’లో గ్లామరస్ రోల్‌తో తెలుగు పరిశ్రమకు వచ్చారు. ఆ తర్వాత దాన్నే కంటిన్యూ చేస్తూ గ్లామరస్ రోల్స్‌లోనే కనిపించారు. అనుష్క ‘గ్లామరస్ హీరోయిన్’ అని ముద్ర పడుతున్న టైమ్‌లో, ‘అరుంధతి’గా వచ్చారు. అంతే.. గ్లామర్ స్టార్ అన్నవాళ్లే పర్ఫార్మెన్స్ స్టార్ అని కితాబులిచ్చేశారు. ‘అరుంధతి’ తరహాలోనే ‘రుద్రమదేవి, భాగమతి’ చిత్రాల్లో అనుష్క అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ‘బాహుబలి’ సినిమాలో ఆమె పోషించిన దేవసేన పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
‘వేదం’లో వేశ్యగా, ‘సైజ్ జీరో’లో బొద్దు అమ్మాయిగానూ అలరించారామె. అలాగే ‘విక్రమార్కుడు, రగడ, మిర్చి’ వంటి కమర్షియల్ చిత్రాల్లోనూ నటించారు. ఇప్పుడిదంతా ఎందుకూ అంటే.. అనుష్క కెమెరా ముందుకు వచ్చి 14 ఏళ్లు పూర్తి అయ్యింది. ‘‘నేను యాక్టింగ్ వైపు వస్తాననుకోలేదు. ‘సూపర్’ సినిమాలో హీరోయిన్ కోసం పూరి జగన్నాథ్‌గారు వెతుకుతున్నారని ఓ ఫ్రెండ్ నా గురించి ఆయనకు చెబితే హైదరాబాద్ వచ్చాను. చాన్స్ ఇచ్చిన నాగార్జునగారికి, పూరీగారికి థ్యాంక్స్. ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు అనుష్క. ప్రస్తుతం హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఓ సినిమా, సంతోష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఓ భక్తి చిత్రంలో అనుష్క నటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment