స్వీటీ అంటే అనుష్క అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ బొమ్మాళి ముద్దు పేరు స్వీటీ అనే విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. స్వీటీ ఫ్యాన్స్‌కి ఓ న్యూ ఇయర్ గిఫ్ట్. ‘బాహుబలి’లో దేవసేనగా కనిపించిన అనుష్క త్వరలో భాగమతిగా కనిపించనున్న విషయం తెలిసిందే. ‘పిల్ల జమిందార్’ ఫేం అశోక్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తోన్న చిత్రం ‘భాగమతి’.
ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైంది. టీజర్‌ను ఈ నెలాఖరుకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. అంటే... న్యూ ఇయర్ గిఫ్ట్ అన్న మాట. జనవరి 26న సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అనుకున్న టైమ్‌కు రిలీజ్ చేయటానికి హైదరాబాద్‌కు చెందిన నాలుగు కంపెనీలతో సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్) వర్క్ చేయిస్తున్నారట.
Comments
Please login to add a commentAdd a comment