...తప్పదు మరి! ‘భాగమతి’ చేసిన పని చూస్తే ఆ ప్రశ్నే వేయాలన్పించింది. ఎవరైనా తమకు తామే ఓ చేత్తో సుత్తి పట్టుకుని, మరో చేతిని గోడపై పెట్టి మేకు కొట్టుకుంటారా? ‘భాగమతి’ అంత పని చేసింది! శిక్ష విధించుకుంది. ఎందుకలా చేసింది? అంటే... త్వరలో తెలుస్తుంది! అనుష్క ముఖ్యతారగా నటిస్తున్న సినిమా ‘భాగమతి’. ‘పిల్ల జమీందార్’ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సిన్మా ఫస్ట్ లుక్‌నే మీరు చూస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో లుక్ విడుదల చేశారు.
లుక్‌లో గోడపై గమనిస్తే... సంకెళ్లతో మహిళ కాళ్లు ఉన్నాయ్ చూశారా? ఆమె ఆత్మ ‘భాగమతి’ అలియాస్ అనుష్కలో ప్రవేశించిందా? ఏమో? టీజర్ లేదా ట్రైలర్స్ వస్తే తెలుస్తుందేమో! ‘‘అనుష్క నటనలో మరో కోణాన్ని చూపించే చిత్రమిది. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు అందర్నీ ఎంటర్‌టైన్ చేస్తాయి’’ అన్నారు దర్శకుడు. ‘‘అనుష్క నటనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అద్భుతమైన కథ. దర్శకుడు అశోక్ చెప్పినదానికంటే బాగా తీశాడు. తమన్ మ్యూజిక్, రవీందర్ సెట్స్, మధి సినిమాటోగ్రఫీ హైలైట్స్’’ అన్నారు నిర్మాతలు. ఉన్ని ముకుందన్, జయరామ్, ఆశా శరత్, మురళీ శర్మ తదితరులు నటించిన ఈ చిత్రానికి కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.
Comments
Please login to add a commentAdd a comment