న్యూ ఇయర్ సందర్భంగా ‘భాగమతి’ చిత్రబృందం అనుష్కకు సంబంధించిన ఒక ఫొటోను విడుదల చేసింది. వీరోచిత పోరాట పటిమను ప్రదర్శిస్తున్న ఓ వీర వనిత చిత్రపటం వైపు తదేకంగా చూస్తున్నారు అనుష్క. ఎప్పటి నుండో సమాధానం తెలియని ఓ ప్రశ్నను అన్వేషిస్తున్నట్టున్నాయి ఆమె చూపులు. విశేషం ఏంటంటే ఆమె చూస్తున్న ఆ చిత్రపటంలో ఉన్న వీరనారి కూడా అనుష్కే.
అంటే... ‘భాగమతి’లో అనుష్క ద్విపాత్రాభినయం చేస్తున్నారా? ఇంతకీ వీళ్లిద్దరికి మధ్య ఉన్న బంధం ఏంటీ? ఆమె వెతుకుతున్న ప్రశ్నకు సమాధానం తెలిసిందా? వీరిలో భాగమతి ఎవరు? వీటన్నింటికి సమాధానం తెలియాలంటే మాత్రం ఈనెల 26 వరకు ఆగాల్సిందే. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘భాగమతి’ సినిమాకు జి.అశోక్ దర్శకత్వం వహించారు. యూవీ క్రి యేషన్స్ పతాకం పై వంశీ–ప్రమోద్‌లు నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమేరా: మది.
Comments
Please login to add a commentAdd a comment