మిల్కీబ్యూటీకి పెళ్లికళ | - | Sakshi
Sakshi News home page

మిల్కీబ్యూటీకి పెళ్లికళ

Published Mon, Nov 25 2024 8:04 AM | Last Updated on Mon, Nov 25 2024 11:40 AM

-

భారతీయ సినీ చరిత్ర పుటల్లో నటి తమన్నా భాటియాకు కచ్చితంగా ఒక పేజీ ఉంటుంది. అంతగా సినీ ప్రేక్షకులను అలరించిన నటి తమన్నా. గత రెండు శతాబ్దాలకు పైగా తమిళం, తెలుగు, హిందీ తదితర భాషల్లో కథానాయకిగా నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న తమనాన ఇప్పటికీ నాటౌట్‌గా సినిమా అనే బరిలో నిలబడటం విశేషం. ఈ మిల్కీబ్యూటీకి ఇప్పటికీ యూత్‌ అభిమానులే ఎక్కువ అని చెప్పవచ్చు. 

ముఖ్యంగా గ్లామర్‌ విషయంలో విమర్శలు వస్తున్నా డోంట్‌ కేర్‌ అంటూ ముందుకు సాగుతున్న నటి తమన్నా. అయితే ప్రేమ వదంతుల్లో ఎక్కువగా చిక్కుకున్న నటి ఈమె. ఇకపోతే తమన్నా బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మతో చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని తనే స్వయంగా పేర్కొన్నారు కూడా. దీంతో పలు వేదికలపై పాల్గొంటున్న ఈ సంచలన జంట నెటిజన్లకు కావాల్సినంత కంటెంట్‌ను ఇస్తున్నారు. 

ఇంకా చెప్పాలంటే లవ్‌లస్ట్‌ అని వెబ్‌ సిరీస్‌ లో తమన్నా, విజయ్‌ వర్మ రొమాంటిక్‌ సన్నివేశాలు ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతూనే ఉన్నాయి. ఇకపోతే తమన్నా విజయ్‌వర్మతో త్వరలో పెళ్లి అనే పయనంలో సప్తపదికి సిద్ధమవుతున్నారు అన్నది తాజా సమాచారం. ఇటీవల ఒక భేటీలో తమన్నా పేర్కొంటూ 2025లో తాను పెళ్లికి సిద్ధం అవుతున్నట్లు చెప్పడం గమనార్హం. తమన్నా విజయ్‌వర్మల వివాహం వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరగనుందని, అందుకు తమన్నా కుటుంబం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదన్నది గమనార్హం.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement