కలెంజ్ఞర్‌ పెన్‌ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

కలెంజ్ఞర్‌ పెన్‌ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

Apr 14 2025 12:33 AM | Updated on Apr 14 2025 12:33 AM

కలెంజ

కలెంజ్ఞర్‌ పెన్‌ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

– రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన

కొరుక్కుపేట: అర్హులైన సీనియర్‌ జర్నలిస్టులు కలైంజ్ఞర్‌ పెన్‌ అవార్డు కోసం ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఏటా మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి జయంతి రోజైన జూన్‌ 3న ప్రముఖ జర్నలిస్టును కలైంజర్‌ అవార్డుతో సత్కరిస్తామని ఉత్తర్వులు జారీ చేశారు. 2024 సంవత్సరానికి ఈ అవార్డు కోసం దరఖాస్తులు చేసుకోవాలని జర్నలిస్టులను కోరింది. ఈ అవార్డు కింద నగదు ప్రోత్సాహం రూ.5 లక్షలతోపాటూ ప్రశంసా పత్రాన్ని అందించనున్నట్టు పేర్కొంది. దరఖాస్తుదారు తప్పనిసరిగా తమిళ వారై ఉండాలి. తమిళ జర్నలిజంలో కనీసం 10 సంవత్సరాల నిరంతర పని అనుభవం ఉండాలి. జర్నలిజం పూర్తి సమయం ఉద్యోగం కావాలి. జర్నలిజం సామాజిక అభివృద్ధికి, అణగారిన ప్రజల అభివృద్ధికి, మహిళల అభ్యున్నతికి తోడ్పడాలి. దరఖాస్తుదారు రచనలు తప్పనిసరిగా ప్రజలపై మంచి ముద్ర వేసి ఉండాలి. దరఖాస్తులను పంపే అభ్యర్థులలో ఒకరిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంపిక కమిటీ సిఫార్సుపై అవార్డుకు ఎంపిక చేస్తారు. ఆయా అంశాలతో కూడిన దరఖాస్తులను సవివరమైన వ్యక్తిగత వివరాలు, సంబంధిత పత్రాలతో ఏప్రిల్‌ 30వ తేదీలోపు డైరెక్టర్‌, ప్రెస్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌, సెక్రటేరియట్‌, చైన్నె–600009కు పంపాలని పేర్కొన్నారు.

దర్శక నిర్మాత

జి. శేఖరన్‌ కన్నుమూత

తమిళసినిమా: సీనియర్‌ సినీ డిస్ట్రిబ్యూటర్‌, నటుడు, నిర్మాత, దర్శకుడు జి. శేఖరన్‌ (73) ఆదివారం మధ్యాహ్నం అని అనారోగ్యం కారణంగా చైన్నెలో కన్నుమూశారు.ఈయన డిస్ట్రిబ్యూటర్‌గా కలైపులి ఎస్‌. థానుతో కలిసి తన సినీ పయనాన్ని ప్రారంభించారు. వీరిద్దరూ కలైపులి ఫిలిమ్స్‌ అనే సంస్థను ప్రారంభించి 1985లో యార్‌ అనే చిత్రాన్ని డిస్టిబ్యూషన్‌ చేశారు. దీంతో జి. శేఖరన్‌ కలైపులి జీ.శేఖరన్‌గా పాపులర్‌ అయ్యారు. కాగా ఈయన 1988లో ఊరై తెరింజిక్కిటేన్‌ అనే చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయం అయ్యారు ఆ తర్వాత కావాల్‌ పూనైగళ్‌, ఉళవాలి తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. అదేవిధంగా ఈయన కథా,కథనం, సంభాషణ రాసి కథానాయకుడుగా నటించిన జమీన్‌ కోటై చిత్రం 1995లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. అదేవిధంగా జి శేఖర్‌ డిస్ట్రిబ్యూట ర్ల సంఘం అధ్యక్షులుగానూ సేవలను అందించారు. ఇలా బహుముఖాలు కలిగిన ఈయన అనారోగ్యం కారణంగా ఆదివారం మధ్యా హ్నం చైన్నె,రాయపురంలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఈయన భౌతికకాయాన్ని చిత్ర ప్రముఖులు, అభిమానుల సందర్శన కోసం ఉంచారు. పలువురు సిని ప్రముఖులు జి.శేఖరన్‌ మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ బస్సును

ఢీకొన్న కారు

– నలుగురు స్నేహితులు మృతి

వేలూరు: కీల్‌ పెన్నాతూరు సమీపంలో ఆదివారం వేకువ జామున ప్రభుత్వ బస్సును కారు వేగంగా ఢీకొన్న ప్రమాదంలో నలుగురు స్నేహితులు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన పలువురిని కలిచి వేసింది. వివరాలు.. పుదుచ్చేరికి చెందిన స్టాలిన్‌(44), సతీష్‌కుమార్‌(52), శైలేష్‌కుమార్‌ (38), సరోఫ్‌ జ్ఞానశేఖరన్‌(50) రెండు రోజుల క్రితం పుదుచ్చేరి నుంచి కారులో బెంగళూరుకు వెళ్లారు. అక్కడ పనులు పూర్తి చేసుకొని శనివారం సాయంత్రం తిరువణ్ణామలై మీదుగా పుదుచ్చేరికి కారులో బయలుదేరారు. కారు ఆదివారం ఉదయం 3 గంటల సమయంలో తిరువణ్ణామలై జిల్లా కీల్‌పెన్నాతూరు సమీపంలోని కట్టుకులం గ్రామం వద్ద వస్తున్న సమయంలో ముందుగా వెలుతున్న ప్రభుత్వ బస్సును కారు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు బాగం నుజ్జునుజ్జు కావడంతో కారులో ప్రయాణం చేస్తున్న నలుగురు స్నేహితులు అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాదం విషయం తెలుసుకున్న కీల్‌పెన్నాతూరు పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం తిరువణ్ణామలై ప్రభుత్వాసుపత్రికి తరలించి పుదుచ్చేరిలోని మృతుల బంధువులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మృతి చెందిన వారందరూ లారీ యజమానుల సంఘం నాయకులుగా తెలిసింది.

కలెంజ్ఞర్‌ పెన్‌ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం 1
1/5

కలెంజ్ఞర్‌ పెన్‌ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

కలెంజ్ఞర్‌ పెన్‌ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం 2
2/5

కలెంజ్ఞర్‌ పెన్‌ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

కలెంజ్ఞర్‌ పెన్‌ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం 3
3/5

కలెంజ్ఞర్‌ పెన్‌ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

కలెంజ్ఞర్‌ పెన్‌ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం 4
4/5

కలెంజ్ఞర్‌ పెన్‌ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

కలెంజ్ఞర్‌ పెన్‌ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం 5
5/5

కలెంజ్ఞర్‌ పెన్‌ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement