రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జైలర్’. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో శివరాజ్ కుమార్, మోహన్‌లాల్, జాకీష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ, తమన్నా, మీర్నా మీనన్ కీలక పాత్రలు పోషించారు. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్‌పై రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 10న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లోకి ఇండియన్ స్టార్ క్రికెటర్ ఎంట్రీ.. స్టార్ మా ప్లాన్ ఇదేనా?)
ఈ సినిమా నుంచి ఇప్పటికే మొదటి పాటతో 'నువ్వు కావాలయ్యా' అంటూ తమన్నా దుమ్ములేపింది. తాజాగా ఈ చిత్రంలోని రెండో పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ‘హుకుం...’ అంటూ సాగే ఈ పాట రజినీకాంత్ స్టైల్‌ని హైలెట్ చేస్తూ సాగుతుంది. ఈ సాంగ్‌లో రజినీకాంత్ స్టైల్‌ను ప్రధానంగా ఎలివేట్ చేస్తూ చిత్రీకరించారు. ఈ పాటకు సుబు రాసిన లిరిక్స్‌కు అనిరుధ్ కంపోజ్ చేసిన ట్యూన్ పక్కాగా సెట్ అయింది ‘హుకుమ్’ సాంగ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఆగస్టు 10 వరకు ఫ్యాన్స్‌కు పండుగే.
Comments
Please login to add a commentAdd a comment