అలాంటి సమయంలో ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసేస్తా | Tamanna React on Her Marriage Proposals | Sakshi
Sakshi News home page

పెళ్లికి అమ్మ నిర్ణయం తీసుకుంది!

Published Wed, Aug 7 2019 6:35 AM | Last Updated on Wed, Aug 7 2019 6:35 AM

Tamanna React on Her Marriage Proposals - Sakshi

సినిమా: అమ్మ నిర్ణయం తీసుకుంది అని అంటోంది నటి తమన్నా. గ్లామరస్‌కు కేరాఫ్‌ అడ్రస్‌ ఈ మిల్కీబ్యూటీ అనడం అతిశయోక్తి కాదు. ఈ గుజరాతీ భామ 12 ఏళ్లకు పైగా హీరోయిన్‌గా రాణిస్తోందంటే కారణం హద్దులు దాటిన తన అందాల ఆరబోతనేని చెప్పవచ్చు. ఈ విషయాన్ని తనే చెప్పింది. కొన్ని చిత్రాల్లో ఐటమ్‌ సాంగుల్లో కూడా నటించేసిన తమన్నా, అలా నటించడం తనకు ఇష్టం అని కూడా చెప్పింది. అలాంటి ఈ అమ్మడిని నటిగా నిరూపించిన చిత్రం బాహుబలి. అందులో అవంతికగా అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించి శభాష్‌ అనిపించుకుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటిస్తున్న తమన్నాకు ఇప్పుడు పెళ్లిపై దృష్టి మళ్లింది. దీని గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలుపుతూ తాను ఏడాదికి 4, 5 చిత్రాలు చేస్తూ వచ్చానని చెప్పింది. ఇప్పుడా సంఖ్య తగ్గిన మాట నిజమేనంది. అయితే అందుకు కారణం ఏమిటని అడుగుతున్నారని, తాను గ్లామరస్‌ పాత్రలను చాలా చేశానని చెప్పింది. అయితే ఇంకా అలాంటి పాత్రలను చేయాలని అనిపించడం లేదని చెప్పింది. తనకు అవకాశాలు తగ్గడానికి ఇదే కారణం అని పేర్కొంది. ఇక తన విజయరహస్యం  అంకితభావంతో పనిచేయడమేనని అంది. మనసు పెట్టి పనిచేస్తే విజయం తథ్యం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

షూటింగ్‌లో ఉన్నప్పుడు అమ్మ వచ్చి మాట్లాడినా, తాను మాట్లాడనని చెప్పింది. ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసేస్తానని తెలిపింది. తన మనస్తత్వం తెలిసినవారెవరూ అలాంటి సమయంలో ఊరికే ఫోన్‌ చేయరని చెప్పింది. ఇకపోతే పెళ్లెప్పుడు చేసుకుంటారు అని అడుగుతున్నారని, ఇంట్లో తనకు పెళ్లి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని చెప్పింది. అమ్మ తనకు పెళ్లి చేయాలనే నిర్ణయం తీసుకుందని అంది. వరుడిని వెతికే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు చెప్పింది. వివాహం విషయాన్ని తల్లిదండ్రులకే వదిలేసినట్లు తమన్నా చెప్పింది. అయితే ఈ మధ్య తనపై ప్రచారం అవుతున్న ప్రేమ వదంతులపై తీవ్రంగా  స్పందించిన ఈ అమ్మడు తానెవరినీ ప్రేమించలేదని, అలా నిజంగా ఎవరినైనా ప్రేమిస్తే ముందుగా మీకే చెబుతానని మీడియా వర్గాలపై మండిపడిందన్నది గమనార్హం. అన్నట్లు ఈ బ్యూటీ ప్రస్తుతం విశాల్‌కు జంటగా సుందర్‌.సీ దర్శకత్వంలో ఒక చిత్రం పెట్రోమ్యాక్‌ అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది. విశాల్‌తోనే మరో చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపినట్లు ప్రచారంలో ఉంది. తాజాగా మరో బాలీవుడ్‌ అవకాశాన్ని తమన్నా అందుకుంది. ఈ చిత్రాలను పూర్తి చేసేలోపు తగిన వరుడు సెట్‌ అయితే తమన్నాకు డుండుండుంనే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement