![Tamanna Opinion Reveal Vijay Sura Movie - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/31/tamanna-bhatia.jpg.webp?itok=XwHy7gMn)
సౌత్ ఇండియాలో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్లలో తమన్నా ఒకరు. సినిమాలతో పాటు పలు వెబ్ సీరిస్‌లతో ఆమె మెప్పిస్తుంది. ఆగష్టు నెలలోనే ఆమె నటించిన జైలర్,భోళా శంకర్ రిలీజ్ కానున్నాయి. తాజాగ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా దళపతి విజయ్ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.
(ఇదీ చదవండి: సుమన్ జైలుకు వెళ్లడంపై బయటికొచ్చిన అసలు నిజాలు.. ఇంతమంది ప్రమేయం ఉందా?)
విజయ్- తమన్నా కలిసి 2010లో 'సుర' అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాలోని పాటలు మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. కానీ సినిమా మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. అంతేకాకుండా ఈ సినిమా విజయ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది. అలాంటి డిజాస్టార్‌పై తమన్నా తాజాగా ఇలా మాట్లాడింది. 'నాకు సుర సినిమా అంటే చాలా ఇష్టం. అందులోని పాటలు ఇప్పటికీ చాలా చోట్ల వినిపిస్తూనే ఉన్నాయి. అందులో నటిస్తున్నప్పుడు కొన్ని సన్నివేశాలు నాకు నచ్చలేదు. కొన్ని సీన్స్‌లలో అయితే నా నటన నాకే నచ్చలేదు. ఆ సీన్లు సరిగా రావడంలేదనే విషయాన్ని షూటింగ్ జరుగుతున్న సమయంలోనే గ్రహించాను.
సీన్స్ బాగా రావడం లేదని సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే అంచనా వేయొచ్చు. కానీ అప్పుడు సినిమా నుంచి తప్పుకోవడం జరగదు. ఎందుకంటే ఒక సినిమాను అంగీకరించిన తర్వాత కచ్చితంగా దాన్ని పూర్తిచేయాల్సిందే. ఏవో కొన్ని కారణాలు చెప్పి తప్పించుకోకూడదు. ఈ రంగంలో జయాపజయాలు సహజం. నటులందరికి ఇండస్ట్రీ చాలా విలువైనది. కాబట్టి ప్రతివారు బాధ్యతాయుతంగా ఉండాలి.' అని తమన్నా చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment