
‘‘ఫిట్‌నెస్ అనే మాట వినగానే చాలామంది అది శరీరానికి సంబంధించినది అనుకుంటారు. కానీ ఫిట్‌నెస్ అంటే మానసిక ఆరోగ్యం కూడా. శరీరం యాక్టివ్‌గా ఉండి మానసికంగా బాగాలేకపోతే అప్పుడు ఏ పనినీ మనసు పెట్టి చేయలేం. అందుకే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యం’’ అంటున్నారు తమన్నా. లాక్‌డౌన్‌లో జిమ్ సెంటర్‌కి వెళ్లడానికి కుదరదు కాబట్టి ఇంట్లో వర్కవుట్స్ పనికొచ్చే వస్తువులతోనే వ్యాయామాలు చేస్తున్నారామె.
(చదవండి :వెబ్ సిరీస్ బాటలోకి విలక్షణ నటుడు)
ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ – ‘‘నీళ్ల బకెట్ ఎత్తడం కూడా ఒక ఎక్సర్‌సైజే. అలాగే ఇల్లు క్లీన్ చేయడం ఓ మంచి వ్యాయామం. వీటితో పాటు ఇంటి బయట ఉన్న ఖాళీ స్థలంలో కాసేపు పరిగెత్తడం, ఉదయాన్నే యోగా చేయడం వంటి వాటితో నా ఫిజికల్, మెంటల్ హెల్త్‌ని కాపాడుకుంటున్నాను. ఫిట్‌నెస్ అనేది నా జీవితంలో ఒక భాగమైపోయింది. నా ఫిట్‌నెస్ మంత్ర ఏంటంటే.. త్వరగా నిద్రపోతాను. త్వరగా నిద్రలేస్తాను. అయితే 8 గంటలు నిద్రపోతాను. ఇప్పుడు కరోనా వైరస్‌లాంటి వాటివల్ల మన రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. ఉసిరికాయ జ్యూస్ బెస్ట్ లేదా గ్రీన్ టీ’’ అని చెప్పారు. హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉన్న తమన్నా చేసిన ‘ది నవంబర్స్ స్టోరీ’ అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కి సిద్ధమవుతోంది. అలాగే ఓటీటీ ప్లాట్‌ఫామ్ కోసం తమన్నా ఓ టాక్ షో చేయబోతున్నారు.