బాహుబలి టీం మరో ప్లాన్ | Baahubali merchandise Coming Soon | Sakshi
Sakshi News home page

బాహుబలి టీం మరో ప్లాన్

Published Fri, Mar 31 2017 1:40 PM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM

బాహుబలి టీం మరో ప్లాన్

బాహుబలి టీం మరో ప్లాన్

సినిమా ప్రమోషన్ విషయంలో సరికొత్త పాఠాలను నేర్పిన ఘనత బాహుబలి టీందే. గతంలో ఎన్నాడూ లేని విధంగా బాహుబలి సినిమాను మీడియా నెత్తికెత్తుకునేలా చేశారు రాజమౌళి టీం. అలా వచ్చిన పబ్లిసిటీ కారణంగానే బాహుబలి సినమాకు ఇంతటి భారీ వసూళ్లు సాధ్యమయ్యాయి. అయితే తాజాగా బాహుబలి ద కంక్లూజన్ విషయంలో కూడా సరికొత్త పబ్లిసిటీ యాక్టివిటీస్ను డిజైన్ చేస్తున్నారు.

అందులో భాగంగా త్వరలో బాహుబలి థీంతో దుస్తులను మార్కెట్ లోకి ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్నారు. అనుపమా దయాల్, సౌరబ్ కాంత్ శ్రీవాస్తవ్, మృణాలినీ గుప్తా, యోగేష్ చౌదరి, అప్రజితా తూర్, సెలెక్స్ వంటి ప్రఖ్యాత డిజైనర్లు ఈ దుస్తులను డిజైన్ చేస్తున్నారు. త్వరలోనే ఆన్లైన్లో అందుబాటులోకి రానున్న ఈ దుస్తులను ఏప్రిల్ 7న ఫ్యాషన్ షోను నిర్వహించనున్నారు. ఈ షోలో తమన్నా, రానాలు త్వరలో మార్కెట్లోకి రానున్న ఈ దుస్తులను ప్రదర్శించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement