అవకాశం వస్తే.. వద్దంటానా? : తమన్నా | Tamanna Says Ready To Act With Big Heroes | Sakshi
Sakshi News home page

అవకాశం వస్తే.. వద్దంటానా?

Published Tue, Feb 25 2020 8:26 AM | Last Updated on Tue, Feb 25 2020 8:26 AM

Tamanna Says Ready To Act With Big Heroes - Sakshi

చెన్నై : మంచి చిత్రాల్లో అవకాశం వస్తే ఎందుకు వద్దంటానంటూ ప్రశ్నిస్తోంది తమన్నా. పెద్ద స్టార్లలతో నటించేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని చెబుతోంది ఈ సుందరి. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ స్టార్‌ హీరోయిన్‌గా మిల్కీ బ్యూటీ పేరు తెచ్చుకుంది. గత ఏడాది వరకూ తమన్నా చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. అయితే ఒక్కసారిగా ఈ సుందరి గ్రాఫ్‌ పడిపోయింది.  ప్రస్తుతం తెలుగులో సిటీమార్‌ అనే ఒకే ఒక్క చిత్రం చేతిలో ఉంది. దానితో పాటుగా మరో హిందీ చిత్రంలో నటిస్తోంది. చాలా కాలం క్రితమే పూర్తైన హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రం దటీజ్‌ మహాలక్ష్మీ విడుదలకు ఇంకా మోక్షం కలగలేదు.

తరచూ ఇన్‌స్ట్రాగామ్‌లో అభిమానులతో టచ్‌లో ఉండే తమన్నా తాజాగా అభిమానుల ప్రశ్నలకు బదులిచ్చింది. అందులో ఒక అభిమాని ఇప్పటికీ చాలా స్లిమ్, అందంగా ఉండడానికి కారణం ఏమిటీ అని అడగ్గా అందుకు కారణం తన తల్లిదండ్రులేనని చెప్పింది. మరో అభిమాని నటుడు సూర్య, తాల అజిత్‌లతో మళ్లీ నటించే అవకాశం వస్తే నటిస్తారా? అని ప్రశ్నించగా సూర్యతో తాను ఇంతకు ముందు అయన్‌ వంటి విజయవంతమైన చిత్రంలో నటించాననీ, ఆయనతో నటించడం ఎప్పుడూ ఇష్టమేననీ చెప్పింది. ఇక నటుడు అజిత్‌తో వీరం చిత్రంలో నటించినట్లు గుర్తు చేసింది. ఆ చిత్రంలో తన నటనకు మంచి పేరు వచ్చిందని తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement