ఆయనతో లిప్‌లాక్‌ అంటే ఓకే! | Actress Tamanna Open up On Lip Lock On Screen | Sakshi
Sakshi News home page

ఆయన కోసం షరతులు సడలిస్తా

Published Sun, Nov 17 2019 9:12 AM | Last Updated on Mon, Nov 18 2019 1:22 PM

Actress Tamanna Open up On Lip Lock On Screen - Sakshi

ఆయన కోసం షరతులు సడలిస్తానంటోంది నటి తమన్నా. హీరోయిన్లకు ఒకటి కాదు, రెండు కాదు, నాలుగు నాలుకలు ఉంటాయనుకుంటా. ఎందుకంటే ఒకసారి కాదన్నదే మరోసారి అవునంటారు. తమన్నా తంతూ ఇదే. గ్లామర్‌కు అడ్రస్‌ ఈ మిల్క్‌బ్యూటీ అంటారు. అలా గ్లామరస్‌ పాత్రలతోనే స్టార్‌ హీరోయిన్‌ అయిన తమన్నా బాహుబలి, సైరా నరసింహారెడ్డి వంటి చిత్రాలతో నటిగా తానేంటో నిరూపించుకుంది. అలా అవసరం అయితే అభినయంలోనూ సత్తా చాటుతానంటున్న తమన్నా ఇకపై గ్లామర్‌కు దూరంగా నటనకు అవకాశం ఉన్న పాత్రల్లోనే నటిస్తానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. అయితే ఆ నిర్ణయానికి కట్టుబడినట్లు కనిపించట్లేదు. ఎందుకంటే తాజాగా విశాల్‌తో జతకట్టిన యాక్షన్‌ చిత్రంతో తనకే సొంతమైన అందాలను తెరపై పరిచేసింది. ఈ విషయాన్ని అటుంచితే ఇటీవల ఆ ఒక్కటి తప్ప అంటూ లిప్‌లాక్‌ సన్నివేశాల్లో ఇప్పుటి వరకూ నటించలేదు, ఇకపై నటించను కూడా అని పేర్కొంది. 

తాను చిత్రాలను అంగీకరించే ముందు దర్శక నిర్మాతలకు విధించే షరతు ఇదేనని పేర్కొంది. అలాంటిది ఇప్పుడు ఆ షరతును ఒకే ఒక్క నటుడికి మినహాయింపు అంటోంది. ఆ లక్కీ నటుడెవరంటే బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌రోషన్‌ అట. ఆ నటుడితో లిప్‌లాక్‌ సన్నివేశాల్లో నటించడానికి అభ్యంతరం లేదని అంటోంది. కారణం ఏమిటయ్యా అంటే హృతిక్‌రోషన్‌కు తాను వీరాభిమానినని చెబుతోంది. అసలు విషయం ఏమిటని ఆరా తేస్తే ఈ అమ్మడికి బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించాలన్నది తీరని కోరిక గానే మిగిలిపోయ్యింది. హిమ్మత్‌వాలా వంటి కొన్ని హిందీ చిత్రాల్లో నటించినా, బాలీవుడ్‌ ప్రేక్షకులు ఈ జాణను పట్టించుకోలేదు. అయినా ఏ పుట్టలో ఏ పాము ఉంటుందోనన్న సామెత మాదిరి వచ్చిన అవకాశాలన్నింటినీ ఓప్పేసుకుని నటించేస్తోంది. అలా నటించిన చిత్రాలు సక్సెస్‌ కావడం లేదు. దీంతో క్రేజీస్టార్‌ ఇమేజ్‌ కలిగిన హృతిక్‌రోషన్‌తో రొమాన్స్‌ చేసి తన కెరీర్‌కు హిట్‌ బాటలోకి మళ్లించుకోవాలని భావిస్తోందని సమాచారం. అందుకే ఆయనతో లిప్‌లాక్‌లో నటించడానికి  తన షరతును సడలించుకుంటానని అంటోంది. అంతా బాగానే ఉంది. హృతిక్‌రోషన్‌ కానీ, ఆయన దర్శక నిర్మాతలు గానీ పాపం  తమన్నాను పట్టించుకోవడం లేదు. ఇంకా గట్టిగా ప్రయత్నించాలేమో. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement