Kajal Aggarwal takes prenatal classes to stay healthy, Details Inside - Sakshi
Sakshi News home page

ప్రెగ్నెన్సీ పాఠాలు నేర్చుకుంటున్న కాజల్‌

Jan 21 2022 5:40 AM | Updated on Jan 21 2022 8:58 AM

Kajal Aggarwal takes prenatal classes to stay healthy - Sakshi

ఈ ఏడాదిలో కాజల్‌ అగర్వాల్, గౌతమ్‌ కిచ్లు తల్లిదండ్రులు కానున్న సంగతి తెలిసిందే. కాజల్‌ గర్భవతి అని ఇటీవల గౌతమ్‌ కిచ్లు కన్ఫార్మ్‌ చేశారు. గర్భవతి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పడానికి భార్య కోసం గౌతమ్‌ కిచ్లు ప్రత్యేకంగా ఓ డాక్టర్‌ను కూడా నియమించారు. ఈ ‘ప్రీ న్యాటల్‌ క్లాసెస్‌’కి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టా స్టోరీస్‌ ద్వారా తెలియజేస్తున్నారు కాజల్‌ అగర్వాల్‌. డెలివరీ వరకూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డెలివరీ అయ్యాక పాటించాల్సినవి.. ఇవన్నీ కూడా ఈ క్లాసెస్‌లో అడిగి తెలుసుకుంటున్నారట.

పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండటం కోసం ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కాజల్‌ చెల్లెలు నిషాకి ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు. నిషా గర్భం దాల్చినప్పుడు, బాబు పుట్టాక కాజల్‌ ఎక్కువ సమయం వారితో గడిపారు. ఆ విధంగా మాతృత్వం తాలూకు అనుభూతి ఎలా ఉంటుందో కొంతవరకూ తెలుసుకున్నారు. ఇప్పుడు తనే తల్లి కానుండటం ఎగ్జయిటింగ్‌గా ఉందని అంటున్నారు కాజల్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement