ఉత్తరప్రదేశ్‌లోని బాందాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అహ్మదాబాద్ నుంచి బాందాకు వస్తున్న 25 ఏళ్ల యువకుడు రైలులో మృత్యువాత పడ్డాడు. ఈ విషయం తెలియని అతని భార్య, కుటుంబసభ్యులు.. ఇక కొద్ది సేపటిలో అతను వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఇంతలో వారికి అసలు విషయం తెలిసింది. దీంతో వారి ఇల్లు శోకసంద్రంగా మారిపోయింది. భర్త ఇక రాడనే సంగతి తెలుసుకున్న భార్య సొమ్మసిల్లి పడిపోయింది.
ఈ ఉదంతం గురించి బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కుమారుడు రైలులో విషప్రయోగానికి బలైపోయాడని ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న జీఆర్‌పీ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారని, తదుపరి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కమాసిన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సుజర్ భాన్ అనే యువకుడు అహ్మదాబాద్‌లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నాడు. అతని కుటుంబం బాందాలో ఉంటోంది. ఆదివారం బరౌనీ-అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి ఇంటికి బయలుదేరాడు.
రక్తంతో కూడిన వాంతులు..
మహోబా స్టేషన్ సమీపంలోకి రైలు చేరుకోగానే ఉన్నట్టుండి అతనికి రక్తంతో కూడిన వాంతులు రావడం మొదలయ్యింది. దీనిని గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే ఈ విషయాన్ని సీఆర్‌పీ పోలీసులతో పాటు రైల్వే అధికారులకు తెలియజేశారు. ఇంతలోనే అతని ఆరోగ్యం విషమించింది. వెంటనే జీఆర్‌పీ పోలీసులు బాధితుడిని రైల్వే వైద్యుల దగ్గకు తీసుకువెళ్లారు. వారు బాధితుడిని పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు.
పోలీసులకు మృతుని జేబులో అహ్మదాబాద్ నుంచి బాందాకు రైల్ టిక్కెట్ లభ్యమయ్యింది. డాక్యుమెంట్ల ఆధారంగా మృతుడు బాందాకు చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. వెంటనే వారు మృతుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలియగానే మృతుని కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. వారు తెలిపిన వివరాల ప్రకారం సూరజ్ భాన్‌కు ఇద్దరు పిల్లలు ఉంటేవారు. వారు మృతిచెందారు. ప్రస్తుతం అతని భార్య నిండుగర్భంతో ఉంది. కొద్దిరోజుల్లో ఆమెకు డెలివరీ జరగనుంది. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: వేలానికి 121 ఏళ్ల క్యాడ్‌బరీ చాక్లెట్.. నాటి తీయని వేడుకకు గుర్తుగా..
Comments
Please login to add a commentAdd a comment