గ్రామంలోకి నో ఎంట్రీ.. నడిచి వెళ్లి, అంబులెన్స్‌లో.. | Pregnant Gives Birth To Baby In Ambulance For Villagers Not Allowed That In Village | Sakshi
Sakshi News home page

గ్రామంలోకి నో ఎంట్రీ.. అంబులెన్స్‌లో గర్భిణి ప్రసవం

Published Mon, May 10 2021 7:41 PM | Last Updated on Mon, May 10 2021 8:37 PM

Pregnant Gives Birth To Baby In Ambulance For Villagers Not Allowed That In Village - Sakshi

అంబులెన్స్‌లో బిడ్డతో పాంగి లలిత

సాక్షి, విశాఖపట్నం : కరోనా వైరస్‌ భయం మనుషుల్లో విచక్షణ కోల్పోయేలా చేస్తోంది. ప్రాణ భయంతో మంచి,చెడులు మరిచిపోతున్నారు జనం. ప్రాణం మీదకు వచ్చినా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. విశాఖ జిల్లాలో తాజాగా జరిగిన ఓ ఘటనే ఇందుకు ఉదాహరణ. పురుటి నొప్పులతో అల్లాడుతున్న ఓ గర్భిణి కోసం వచ్చిన అంబులెన్స్‌ను సైతం ఊర్లోకి రాకుండా అడ్డుకున్నారు గ్రామస్తులు. వివరాలు.. విశాఖ ఏజెన్సీలోని జి.మాడుగుల మండలం పాల మామిడి గ్రామస్తులు.. గ్రామంలోకి వేరే వాళ్లు రాకుండా సరిహద్దు వద్ద గేట్‌ ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన పాంగి లలిత అనే మహిళకు పురుటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు కోరిన మేరకు అంబులెన్సు వచ్చింది. కానీ, గ్రామస్తులు గ్రామంలోకి అంబులెన్స్‌ను అనుమతించలేదు. దీంతో ఆ గర్భిణిని నడిపించుకుంటూ గ్రామ శివారులోని అంబులెన్స్ ఎక్కించారు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్లేలోగా లలిత బాబుకు జన్మనిచ్చింది. ప్రజలు కరోనా భయంతో అంబులెన్స్‌ను గ్రామంలోకి అనుమతించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement