గర్భవతుల్లో... అందునా ఆరు, ఏడు నెలల్లో (28 వారాల సమయంలో) గుండెలో మంట, ఛాతీలో ఇబ్బంది, కడుపులోని ఆహారం పైకి ఎగదన్నుతున్న ఫీలింగ్, అజీర్తి, తేన్పుల బాధ వంటి సమస్యలు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఇది మామూలే. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడే గ్యాస్ట్రిక్ జ్యూస్... జీర్ణాశయం నుంచి పై వైపునకు అంటే అన్నవాహిక వైపు ఎగజిమ్మడమే ఇందుకు కారణం.
గర్భవతుల్లో కండరాలను వదులుగా అయ్యేలా చేయడానికి ప్రోజెస్టెరాన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంటుంది. పిండం పెరుగుతున్న కొద్దీ గర్భసంచిలో దానికి చోటు కల్పించడం కోసం, అలాగే గర్భసంచి కండరాలు వదులయ్యేలా చేసేందుకు ప్రకృతి చేసిన ఏర్పాటిది. ఈ హార్మోన్ తన సహజ గుణం కొద్దీ కేవలం గర్భసంచిని మాత్రమే వదులు చేయకుండా ఇతర కండరాలను... అంటే... పక్కనే ఉన్న జీర్ణాశయం–అన్నవాహిక మధ్యన ఉండే కవాటం వంటి స్ఫింక్టర్ (లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్) మొదలైన వాటి మీద కూడా తన ప్రభావం చూపుతుంది.
అలా ఆ స్ఫింక్టర్ వదులైపోవడంతో తిన్న పదార్థం, దానితో పాటు జీర్ణరసాలు... జీర్ణాశయం నుంచి అన్నవాహికలోకి పైకి ఎగజిమ్ముతాయి. ఒకేసారి ఎక్కువగా కాకుండా చిన్న చిన్న మోతాదుల్లో ఎక్కువసార్లు తినడం, తినగానే పడుకోకుండా, కాస్త వాకింగ్ చేయడం, పడుకున్నప్పుడు తలగడ పెట్టుకోవడం, తినే ఆహారంలో కారం, వేపుళ్లు, మసాలాలు తక్కువ తీసుకోని, మజ్జిగలాంటివి తీసుకోవడం వల్ల సమస్య తగ్గుతుంది. కొన్నిసార్లు అవసరాన్ని బట్టి డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని యాంటాసిడ్స్ కూడా వాడాల్సి రావచ్చు.
చదవండి: C- Section: మొదటిసారి సిజేరియన్... రెండోసారీ తప్పదా? తల్లి ఎత్తు 135 సెం.మీ. కంటే తక్కువ ఉన్నప్పుడు..
Health Benefits of Eating Dates: తీపిగా ఉండే ఖర్జూరాలు తరచుగా తింటున్నారా? ఈ విషయాలు తెలిస్తే!
Comments
Please login to add a commentAdd a comment