Actress Sanjana Galrani: Pregnant Expecting First Child In May 2022 Details Inside - Sakshi
Sakshi News home page

Sanjana Galrani: త్వరలోనే తల్లి కాబోతున్న 'బుజ్జిగాడు' హీరోయిన్‌

Published Mon, Jan 10 2022 11:29 AM | Last Updated on Mon, Jan 10 2022 12:46 PM

Actress Sanjana Galrani Pregnant Expecting First Child In May 2022 - Sakshi

Actress Sanjana Galrani Pregnant Expecting First Child In May 2022: బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్‌ సంజనా గల్రానీ అభిమానులకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం తాను ప్రెగ్నెంట్‌ అని, త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు పేర్కొంది. 'మాతృత్వం అనేది ఓ అందమైన అనుభూతి. ఇప్పుడు నేను 5నెలల గర్భంతో ఉన్నాను. డెలివరి ముందు వరకు కూడా విశ్రాంతి తీసుకోవాలనుకోవట్లేదు.

ప్రసవం అయ్యేంతరకు పనిచేయాలనుకుంటున్నా. కొంత మంది మహిళలు డెలివరికి రెండు వారాల వరకు కూడా పని చేస్తారు. వారి లాగే నేను కూడా ఉండాలనుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది. కాగా ఇటీవలె ఆమె భర్తతో విడాకులు తీసుకోబోతుందంటూ సోషల్‌ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై ఘాటుగా స్పందించిన ఆమె తన వైవాహిక జీవితం చాలా బాగుందని, ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

గతేడాది శాండల్‌ వుడ్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన ఈ బ్యూటీ మూడు నెలలు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే.  బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత తన చిరకాల మిత్రుడు, ప్రియుడు డాక్టర్‌ పాషాను 2021 జనవరిలో రహస్య వివాహం చేసుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement