
చికిత్స పొందుతున్న బిడ్డ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్న సూపరింటెండెంట్
దేవతకు ప్రతిరూపం..అనురాగం, ఆప్యాయత పంచేది అమ్మ..లోకం నిన్ను ద్వేషించినా నిన్ను ప్రేమించేది అమ్మ.. జన్మజన్మల బంధం అమ్మ.. లోకంలోనే అంతటి గొప్ప పదానికే ఓ తల్లి మచ్చతెస్తే.. పురిట్లోనే పేగు బంధం తెంచేస్తే.. భారం తనకొద్దంటూ కనిపారేస్తే.. ఆ పసిప్రాయం ఎంత విలవిల్లాడి ఉంటుంది.. ఆ హృదయం ఎంత యాతన పడి ఉంటుంది.. ఆ గొంతు ఎంత తడారిపోయి ఉంటుంది.. అమ్మతనానికే మచ్చ తీసుకొచ్చిన హృదయ విదారకర ఘటన చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చోటు చేసుకుంది.
చిత్తూరు రూరల్: ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ ఆ తల్లి మాతృత్వపు మమకారాన్ని సైతం కాదనుకుంది. తల్లి పొత్తిళ్లలో సేద తీరాల్సిన పసికందును చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రి బాత్‌రూమ్‌లో వదిలి వెళ్లిపోయింది. అటు వైపుగా వెళ్లిన స్వీపర్, సెక్యూరిటీ సిబ్బంది చిన్నారిని చూసి, ఎస్‌ఎన్‌సీ యూ డాక్టర్లకు అప్పగించారు. అధికారుల కథనం మేరకు.. 19 ఏళ్ల వయస్సున్న ఓ గర్బిణి కడుపు నొప్పి అంటూ బుధవారం వేకువజామున 4.30 గంటలకు చిత్తూరు ప్రభుత్వాస్పత్రిని ఆశ్రయించింది. అక్కడి డ్యూటీ డాక్టర్లు ఆమైపె అనుమానం రావడంతో.. మీరు గర్భిణినా? అని అడిగారు. కా దంటూ ఆ గర్భిణి, ఆమె వెంట వచ్చిన ఇద్దరు వ్య క్తులు వాదించడంతో చివరకు డాక్టర్ ఆమెకు పరీక్షలు చేయించుకోవాలని టెస్ట్‌లు రాసి ఇచ్చారు.
అయితే పురిటినొప్పులు అధికమై గర్భిణి బాత్‌రూమ్‌లోకి వెళ్లింది. అక్కడే ఆడబిడ్డకు జన్మనిచ్చిన త ల్లి.. పసికందును బాత్‌రూమ్‌లోనే వదిలి పరారైంది. వారి వెంట వచ్చిన ఇద్దరు వ్యక్తులు కూడా కనిపించకుండా మాయమయ్యారు. అటూ వైపుగా వెళ్లి న స్వీపర్ మోహనమ్మ, సెక్యూరిటీ సందీప్ పసిగు డ్డు ఏడుపును గుర్తించారు. వెంటనే డాక్టర్లకు సమా చారం అందించి, బిడ్డను ఎస్‌ఎన్‌సీయూకు తీసుకెళ్లారు.
ప్రస్తుతం ఎస్‌ఎన్‌సీయూలో చికిత్స పొందుతున్న బిడ్డను ఆస్పత్రి అధికారులు ఐసీడీఎస్ అధి కారులకు అప్పగించారు. బిడ్డ ఆరోగ్య పరిస్థితిని ఎ ప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అయితే ఆ త ల్లి బాత్‌రూమ్‌లో పసికందును ఎందుకు వదిలి వె ళ్లింది? ఆడబిడ్డ అని వదిలేసేరా? మరేమైనా ఇతర కారణాలున్నాయా? అనే కోణంలో ఆస్పత్రి అధికారులు విచారిస్తున్నారు. సీసీ పుటేజీలను పరిశీలించనున్నారు. తర్వాత పోలీసులను ఆశ్రయిస్తామని సూపరింటెండెంట్ అరుణ్‌కుమార్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment