సిండికేట్‌.. అ‘ధర’హో! | - | Sakshi
Sakshi News home page

సిండికేట్‌.. అ‘ధర’హో!

Published Fri, Apr 18 2025 12:56 AM | Last Updated on Fri, Apr 18 2025 12:56 AM

సిండి

సిండికేట్‌.. అ‘ధర’హో!

హెచరీల సిండికేట్‌తో చికెన్‌ ధర కొండెక్కి కూర్చుంది. ప్రాంతం, సీజన్‌ల వారీగా రేట్లు పెంచుతున్నాయి.

శుక్రవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

గోశాలకు వెళ్లకుండా భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఇతర నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు (ఇన్‌సెట్‌) ఎంపీ గురుమూర్తితో కూటమి నేతల వాగ్వాదం

ఆర్టీసీలో టెండర్ల ఆహ్వానం

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం):చిత్తూరు జిల్లాలోని ఆర్టీసీ పరిధిలో ఉన్న వివిధ షాపుల నిర్వహణకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు డీపీటీఓ జితేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఆసక్తి గల వారు ఈనెల 24వ తేదీ లోపు ఆయా డిపోల పరిధిలో టెండర్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. చిత్తూరు నగరం ఆర్టీసీ బస్టాండ్‌లోని డీపీటీఓ కార్యాలయంలో 25వ తేదీ టెండర్ల ప్రక్రియ జరుగుతుందన్నారు. ఇతర వివరాలకు www.aprrtc.ap.gov.inలో చూ సుకోవచ్చని పేర్కొన్నారు.

ఒకటో తరగతిలో అడ్మిషన్లకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు

చిత్తూరు కలెక్టరేట్‌ : రాష్ట్ర విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు ఉచిత నిర్భంద విద్యాహక్కు చట్టం ప్రకారం ఒకటో తరగతిలో అడ్మిషన్లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ వరలక్ష్మి తెలిపారు. గురువారం డీఈఓ విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 2025–26 విద్యాసంవత్సరంలో ఒకటో తరగతి అడ్మిషన్ల కు ప్రైవేట్‌, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఐబీ, ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ, స్టేట్‌ సిలబస్‌లు అమ లు చేయాలన్నారు. ఆయా యాజమాన్యాల్లో ఒకటో తరగతిలో విద్యనభ్యసించేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 28 నుంచి మే 15వ తేదీలోపు www.cre.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలని డీఈఓ కోరారు.

వెబ్‌సైట్‌లో ఏకీకృత

సీనియారిటీ జాబితా

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్‌అసిస్టెంట్ల ఏకీకృత సీనియారిటీ జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు డీఈ ఓ వరలక్ష్మి తెలిపారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌ నుంచి హెచ్‌ఎం కేడర్‌ ఉద్యోగోన్నతికి మెరిట్‌ ప్రకారం సిద్ధం చేసిన ఏకీకృత సీనియారిటీ జాబితాను ఈ నెల 17వ తేదీన విడుదల చేశామన్నారు. ఈ జాబితాను స్కూల్‌ అసిస్టెంట్లు సరిచూసుకోవాలన్నారు. ఏవైనా అభ్యంతరాలున్నట్‌లైతే తగు ఆధారాలతో ఈ నెల 20 వ తేదీలోపు డీఈఓ కార్యాలయంలో అందజేయాలన్నారు. గడువు తేదీ తర్వాత వచ్చే అభ్యంతరాలను స్వీకరించబడవని డీఈఓ వెల్లడించారు.

శ్రీవారి దర్శనానికి 12 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 13 కంపార్ట్‌మెంట్లు నిండాయి. క్యూలైన్‌ టీబీసీ వద్దకు చేరింది. బుధవా రం అర్ధరాత్రి వరకు 70,372 మంది స్వామివారిని దర్శించుకోగా 24,463 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.25 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.

శ్రీవారికి నాణ్యమైన సేవలు

తిరుపతి కల్చరల్‌: శ్రీవారి భక్తుల సేవ నిరంతరం అని, మరింత నాణ్యమైన సేవలు అందిస్తూ శ్రీవా రి అనుగ్రహానికి పాత్రులు కావాలని ఏపీ శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌ వేగుల్ల జోగేశ్వరరావు సూచించారు. పద్మావతి అతిథి గృహంలో గురువారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి ఏపీ అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్‌, సభ్యులు, టీటీడీ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జోగేశ్వరరావు మాట్లాడుతూ అంచనాల కమిటీ చేసిన పలు సూచలను పరిగణనలోకి తీ సుకుని మరింత నాణ్యంగా సేవలు అందించాల న్నారు. వసతి గదుల నిర్వహణపై నిత్యం పర్యవేక్షణ ఉండాలని సభ్యులు సూచించారు. స్వామి వారి కీర్తనలు, గోవిందనామావళిని రాత్రి 10 గంటల వరకు వినిపించేలా చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. టీటీడీ ఈఓ శ్యామలరావు సమాధానం ఇస్తూ ఇప్పటికే ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. తిరుమలలో అందిస్తున్న సేవలపై శాఖల వారీగా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా టీటీడీ అదనపు ఈవో సీహెచ్‌.వెంకయ్య చౌదరి, ఏపీ అంచనాల కమిటీ సభ్యులకు వివరించారు. ఏపీ అంచనాల కమిటీ సభ్యులు భూమా అఖిలప్రియ, నిమ్మక జయకృష్ణ, వెంకటరాజు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం పాల్గొన్నారు.

సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీటీడీ గోశాలలో గోవుల మృతిపై లెక్కతేలకుండా కూటమి నేతలు అడ్డుకట్టకు యత్నించారు. తప్పులు కప్పిపుచ్చేందుకు అధికార మదంతో రెచ్చిపోయారు. కుట్రపూరితంగా సవాల్‌ విసిరి రెచ్చగొట్టారు. ఆపై పోలీసులను రంగంలోకి దింపి వైఎస్సార్‌సీపీ నాయకులు గోశాలకు వెళ్లకుండా నిర్బంధకాండకు పూనుకున్నారు. ఈ ఘటన గురువారం తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

తప్పుడు ప్రకటనలు..కప్పిపుచ్చే యత్నాలు

టీటీడీ గోశాలలో వరుసగా గోవులు మృత్యువాత పడుతున్నాయంటూ ఇటీవల వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి సంచలన విషయాలు తెరపైకి తెచ్చారు. నాటి నుంచి కూటమి నేతలు ఆ తప్పుని కప్పిపుచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. మొదట తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్‌ పరస్పర విరుద్ధ ప్రకటనలకు దిగారు. 40 గోవులు మృతి చెందాయని ఒకరంటే.. కాదుకాదు 20 నుంచి 22 గోవులు మాత్రమే మృతి చెందాయని ఇంకొకరు చెప్పుకొచ్చారు. మరో వైపు టీటీడీ ఏకంగా ఈఓ మీడియా సమక్షంలోనే గత మూడు నెలల కాలంలో 43 గోవులు మృతి చెందాయని కుండబద్ధలు కొట్టేశారు. మొదటి రోజు గోవులు చనిపోలేదని ప్రకటన చేసి.. మరుసటి రోజు గోవులు మరణించాయని ప్రకటన చేయడాన్ని కూటమి శ్రేణులే తీవ్రంగా తప్పుపడుతున్నారు.

సవాల్‌ విసిరి..నిజాలు దాచి

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ట్విట్టర్‌ వేదికగా రెచ్చిపోయారు. టీటీడీ గోశాలలో గోవులు మృతిచెంది ఉంటే నిరూపించాలంటూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డికి సవాల్‌ విసిరారు. దీనిపై భూమన కరుణాకరరెడ్డి స్పందించారు. గురువారం ఉదయం 10గంటలకు టీటీడీ గోశాలకు వస్తాను అని ప్రకటన చేయగా.. పల్లా రమ్మని ఆహ్వానించారు. తీరా పల్లా శ్రీనివాసరావు రాకపోగా.. కూటమి నేతలను గుంపుగా గోశాలకి పంపించారు. వైఎస్సార్‌సీపీ నాయకులను గోశాలకు వెళ్లకుండా అడ్డుకట్టకు తెరలేపారు. బుధవారం అర్ధరాత్రి నుంచి కూటమి నేతలు ఆడిన నాటకాలు చూసి స్థానికులు నవ్వుకుంటున్నారు.

– 10లో

– 10లో

న్యూస్‌రీల్‌

కూటమి నేతలు కపట నాటకాలకు తెరదీశారు. జరిగిన తప్పుని సరిదిద్దాల్సింది పోయి బుకాయింపులకు దిగారు. టీటీడీ గోశాలలో గోవుల మృత్యుఘోషను ప్రపంచానికి వినిపించకుండా.. కళేబరాలు కనిపించకుండా చేయాలని విశ్వప్రయత్నాలు చేశారు. చివరకు సవాల్‌ విసిరి నిజాలు నిగ్గుతేలుతాయని భయపడిపోయారు. పోలీసులను రంగంలోకి దింపి ఎక్కడికక్కడ అడ్డుకుంటూ చెలరేగిపోయారు. వీరి నాటకాలు చూసిన జనాలు ఔరా..? అంటూ ముక్కున వేలేసుకున్నారు. గోసంరక్షణను గాలికొదిలేసి ఇలా బరితెగించడం ఎంతవరకు కరెక్ట్‌ అని ఎదురుదాడికి దిగారు. ఈ ఘటన గురువారం తిరుపతిలో చర్చనీయాంశంగా మారింది.

టీటీడీ గోశాల ఘటనపై హైడ్రామా

సవాల్‌ విసిరి స్వీకరించకుండా అడ్డగింపులు

వైఎస్సార్‌సీపీ నేతలు వెళ్లకుండా పోలీసుల నిర్బంధం

నిజాలు నిగ్గుతేలకుండా ఇదేం పని అంటున్న స్థానికులు

ఇదేనా సనాతన ధర్మం

తామే సనాతన ధర్మానికి ప్రతినిధులమని, హిందువులు, గోమాతలంటే భక్తి అని చెప్పుకునే కూటమి నేతలు.. టీటీడీ గోశాలలో ఉన్న పవిత్రమైన శ్రీవేణుగోపాలస్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో చెప్పులు ధరించి తిరిగారు. ఆలయం అరుగుపై చెప్పులతోనే నిల్చొని ఫొటోలకు ఫోజులిచ్చారు. దీనిపై కూటమి శ్రేణులే ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.

నిజాలు నిగ్గుతేల్చేందుకు సిద్ధం

తిరుపతి మంగళం : టీటీడీ గోశాలలో గోవుల మృతిపై టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్‌రావు విసిరిన సవాల్‌ను తమ పార్టీ జిల్లా అధ్యక్షులు, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి స్వీకరించి గోశాలకు వస్తామంటే పోలీసులచేత అడ్డుకోవడం ఏంటని మాజీ మంత్రులు ధ్వజమెత్తారు. తిరుపతి పద్మావతీపురంలో పార్టీ క్యాంప్‌ కార్యాలయం నుంచి గురువారం గోశాలకు వెళ్లేందుకు బయలుదేరిన భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, నియోజకవర్గ సమన్వయకర్తలు భూమన అభినయ్‌రెడ్డి, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, నూకతోట రాజేష్‌ను పోలీసులచేత ఎందుకు నిర్బంధించారని ప్రశ్నించారు.

సిండికేట్‌.. అ‘ధర’హో!
1
1/10

సిండికేట్‌.. అ‘ధర’హో!

సిండికేట్‌.. అ‘ధర’హో!
2
2/10

సిండికేట్‌.. అ‘ధర’హో!

సిండికేట్‌.. అ‘ధర’హో!
3
3/10

సిండికేట్‌.. అ‘ధర’హో!

సిండికేట్‌.. అ‘ధర’హో!
4
4/10

సిండికేట్‌.. అ‘ధర’హో!

సిండికేట్‌.. అ‘ధర’హో!
5
5/10

సిండికేట్‌.. అ‘ధర’హో!

సిండికేట్‌.. అ‘ధర’హో!
6
6/10

సిండికేట్‌.. అ‘ధర’హో!

సిండికేట్‌.. అ‘ధర’హో!
7
7/10

సిండికేట్‌.. అ‘ధర’హో!

సిండికేట్‌.. అ‘ధర’హో!
8
8/10

సిండికేట్‌.. అ‘ధర’హో!

సిండికేట్‌.. అ‘ధర’హో!
9
9/10

సిండికేట్‌.. అ‘ధర’హో!

సిండికేట్‌.. అ‘ధర’హో!
10
10/10

సిండికేట్‌.. అ‘ధర’హో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement