
మేసీ్త్ర పనులు చేస్తూ కుమార్తెను చదివిస్తూ..
జిల్లాలోని రొంపిచెర్ల కేజీబీవీ విద్యార్థిని స్రవంతి ఇంటర్మీడియట్ ఫలితాల్లో 935 మార్కులు సాధించింది. సన్‌షైన్ అవార్డుకు ఎంపికై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా అవార్డు సైతం స్వీకరించింది. కర్నూలు జిల్లాకు చెందిన శివన్న, దేవమ్మకు ఇద్దరు కుమార్తెలు. శివన్న తిరుపతిలో మేసీ్త్ర పనులు చేసుకుంటూ ఇద్దరు కుమార్తెలను చదివించుకుంటున్నారు. స్రవంతిని కేజీబీవీ పాఠశాలలో చదివిస్తున్నారు. గత ఐదు సంవత్సరాల్లో అప్పటి ప్రభుత్వం కేజీబీవీ పాఠశాలల్లో అనేక మార్పులు తీసుకొచ్చిందని, ఆ మార్పులతోనే తాను ఉత్తమ ఫలితాలు సాధించినట్లు స్రవంతి వెల్లడించింది.