Pregnancy Rumours On Kajal Aggarwal: హీరోయిన్ కాజల్ అగర్వాల్ త్వరలోనే గుడ్‌న్యూస్ చెప్పనుందా అంటే అవుననే సమాధానం జోరుగా వినిపిస్తుంది. గతడాది అక్టోబర్30న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో కాజల్ వివాహం అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆమె గర్భవతిగా ఉందని, అందుకే కొత్త ప్రాజెక్టులకు సైన్ చేయడం లేదని టాక్ వినిపిస్తోంది. పెళ్లి తర్వాత కూడా కాజల్ వరుసగా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఆమె చిరంజీవితో ఆచార్య, నాగార్జునతో ఘోస్ట్ చిత్రాల్లో నటిస్తుంది. ఈ సినిమాలకు సంబంధించి తన షూటింగ్ పార్ట్‌ను త్వరగా పూర్తి చేయాలని కాజల్ మేకర్స్‌ను కోరిందట. తల్లి కాబోతున్న సందర్భంగా విశ్రాంతి తీసుకోవాలని కాజల్ భావిస్తుందని, ఈ క్రమంలోనే కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదని సోషల్ మీడియా కోడై కూస్తుంది. మరో ఏడాది వరకు షూటింగులకు పూర్తిగా గుడ్ డై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
చదవండి : ఆ ప్రశ్న అడగటంతో రిపోర్టర్‌పై సమంత సీరియస్
మాస్ట్రో: తమన్నాను అలా చూసి ఏడ్చిన డైరెక్టర్ గాంధీ కూతురు
Comments
Please login to add a commentAdd a comment