హీరోయిన్‌ కాజల్‌ ముఖ్యమైన ప్రకటన..ఇన్‌స్టాలో పోస్ట్‌ | Kajal Aggarwal Special Announcement Might Be About Her Pregnancy | Sakshi
Sakshi News home page

Kajal Aggarwal: అధికారికంగా ప్రకటించనున్న కాజల్‌

Published Fri, Oct 8 2021 12:03 PM | Last Updated on Fri, Oct 8 2021 3:33 PM

Kajal Aggarwal Special Announcement Might Be About Her Pregnancy - Sakshi

Kajal Aggarwal To Make An Important Announcement: హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ అటు అటు పర్సనల్‌, ఇటు ప్రొఫెషనల్‌ లైఫ్‌ను బ్యాలెన్స్‌ చేస్తుంది. గతడాది అక్టోబర్‌30న వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లును పెళ్లాడిన కాజల్‌ ప్రస్తుతం చిరంజీవితో ఆచార్య, నాగార్జునతో ఘోస్ట్‌ చిత్రాల్లో నటిస్తుంది. అయతే గత కొంతకాలంగా ఆమె కొత్త ప్రాజెక్టులకు సైన్‌ చేయడం లేదని టాక్‌ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సెట్స్‌ మీద ఉన్న సినిమాలను త్వరగా పూర్తి చేయాలని మేకర్స్‌ను కోరిందట. చదవండి: మనసులోని బాధను బయటపెట్టిన సమంత.. పోస్ట్‌ వైరల్‌

తాజాగా కాజల్‌.. 'ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ కమింగ్‌ సూన్‌..స్టే ట్యూన్‌డ్‌' అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. దీంతో కాజల్‌ ఏం ప్రకటన ఏం చేయబోతుందా అన్న క్యూరియాసిటీ పెరిగింది. ఈ పోస్ట్‌కు లవ్‌సింబల్‌తో పాటు డాన్స్ చేస్తున్న ఏమోజీని కూడా జత చేయడంతో ఇది సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంటా లేక పర్సనల్‌ లైఫ్‌కి సంబంధించి విషయమా అన్న చర్చ మొదలైంది.

గత కొంతకాలంగా ఆమె గర్భవతి అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో దాని గురించి ఏమైనా ప్రకటన చేయనుందా అన్న సందేహం వ్యక్తమవుతుంది. దీనిపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. చదవండి:  విడాకుల తర్వాత..నెంబర్‌1 స్థానంలోకి సమంత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement