స్నేహ అమ్మతనానికి దగ్గరవుతున్నారా? | Sneha dismisses pregnancy rumors | Sakshi

స్నేహ అమ్మతనానికి దగ్గరవుతున్నారా?

Published Wed, Sep 17 2014 11:32 PM | Last Updated on Sat, Sep 2 2017 1:32 PM

స్నేహ అమ్మతనానికి దగ్గరవుతున్నారా?

స్నేహ అమ్మతనానికి దగ్గరవుతున్నారా?

 నటి స్నేహ అమ్మతనానికి దగ్గరవుతున్నారా? అవుననే ప్రచారానికి మీడియా తెర లేపింది. స్నేహ ప్రస్తుతం గర్భం దాల్చినట్లు 2015 ఆరంభంలో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారనే ప్రచారం సాగుతోంది.  తమిళం, తెలుగు భాషలో ప్రముఖ హీరోయిన్‌గా వెలుగొందిన నటి స్నేహ. పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ఎక్స్‌పోజింగ్ జోలికి అంతగా పోలేదనే చెప్పాలి. తెలుగులో శ్రీరామదాస్ వంటి భక్తిరస చిత్రాల్లోనూ నటించి మెప్పించిన స్నేహ ఇప్పుడు 32 ఏళ్ల ప్రౌడ. నటుడు ప్రసన్నను ప్రేమించి, పెద్దల సమ్మతితో 2012 మే 11న పెళ్లి చేసుకుంది. అంటే ఈ ముద్దుగుమ్మ సంసార జీవితంలోకి అడుగుపెట్టి రెండేళ్లు దాటింది. ప్రస్తుతం అమ్మతనానికి దగ్గరవుతున్నట్లు మీడియా ప్రచారం అయితే ఈ విషయాన్ని స్నేహ ఖండించారు.
 
 ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివాహానంతరం అడపా దడపా చిత్రాల్లో నటిస్తున్నా ఎక్కువ సమయాన్ని సంసార జీవితంలోనే గడుపుతున్నారన్నారు. ఈ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నానని తెలిపారు. ఆ మధ్య ప్రకాష్‌రాజ్ సరసన ఉన్ సమయిల్ అరైయిల్ చిత్రంలో నటించానని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం తాను గర్భిణీగా ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి వదంతులు తన వివాహానికి ముందు ఆ తరువాత కూడా చాలా ప్రచారం అయ్యాయని నవ్వేశారు. నిజానికి తాము పేరెంట్ హుడ్ కావాలనే నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. మరో విషయం ఏమిటంటే కథానాయికగా తెలుగులో ఒక చిత్రం చేయనున్నానని తెలిపారు. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం కథ చాలా కొత్తగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
 
 చిత్ర నిర్మాణం : తాను, ప్రసన్న సొంతంగా చిత్ర నిర్మా ణం చేపట్టాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. చిత్ర పరిశ్రమలో పది కాలాలు గుర్తుండిపోయే మంచి చిత్రాలను నిర్మించాలనుకుంటున్నామన్నారు. ఈ చిత్రా ల్లో  ప్రసన్న మాత్రం నటిస్తారని చెప్పా రు. ప్రసన్నను ఇప్ప టివరకు చాక్లెట్ బాయ్‌గాను,  ప్రతినాయకుడిగాను చూశారన్నారు. ఇప్పుడు గ్రామీణ పాత్రల్లో చూపిస్తూ ఒకటి రెండు చిత్రాలు చేయాలనుకుంటున్నట్లు నటి స్నేహ తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement