![Rana Daggubati Wife Miheeka Bajaj Squashes Pregnancy Rumours - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/8/Mihika-Bajaj.jpg.webp?itok=tAIti9XL)
టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి త్వరలో తండ్రి కాబోతున్నాడంటూ ఓ వార్త ఇటీవల సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. రానా భార్య మిహికా బజాజ్ బీచ్ ఒడ్డున నడుస్తున్న వీడియో షేర్ చేయగా తను కాస్త బొద్దుగా తయారైందని, చూస్తుంటే గర్భవతిలా అనిపిస్తోందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. తాజాగా ప్రెగ్నెన్సీ రూమర్స్‌కు చెక్ పెట్టింది మిహికా.
'నేను ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. వైవాహిక జీవితంలో నేను సంతోషంగా ఉన్నాను. ఈ మధ్య కాస్త బరువు పెరిగి బొద్దుగా కనిపిస్తున్నాననంతే! అంతే తప్ప నేను గర్భవతిని కాదు. నిజంగా నేను గర్భం దాల్చినప్పుడు ఆ విషయాన్ని మీ అందరితో పంచుకుంటాను' అని చెప్పుకొచ్చింది. అలాగే సినిమాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ తనకు యాక్ట్ చేయాలన్న ఆసక్తి లేదని పేర్కొంది.
ఇకపోతే రానా దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారంటూ గతంలోనూ ప్రచారం జరిగింది. ఈ వార్తలను దంపతులిద్దరూ కొట్టిపారేశారు. కాగా రానా, మిహికా 2020 ఆగస్టు 8న పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మిహికా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
చదవండి: కొందరిని నమ్మి రూ.60 లక్షలు పోగొట్టుకున్నా: కమెడియన్
Comments
Please login to add a commentAdd a comment